- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లడఖ్‌లో భారీ భూకంపం.. 5.7 తీవ్రతతో వణికిన లేహ్ ప్రాంతం
భారత్‌లోని కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకారం, రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.7గా నమోదైంది.

దిశ, వెబ్ డెస్క్: భారత్‌లోని కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (NCS) ప్రకారం, రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.7గా నమోదైంది. ఉదయం 11:51 గంటల సమయంలో సంభవించిన ఈ ప్రకంపనలు లేహ్ ప్రాంతం తో పాటు జమ్మూ కశ్మీర్, మధ్య ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా స్పష్టంగా కనిపించాయి. భూ అంతర్భాగంలో 171 కిలోమీటర్ల లోతులో భూకంపం పుట్టినట్లు అధికారులు గుర్తించారు. భూకంపం సంభవించిన వెంటనే భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తి నష్టం కానీ జరిగినట్లు నివేదికలు అందలేదు. హిమాలయ ప్రాంతం భౌగోళికంగా భూకంప ప్రభావిత జోన్‌లో ఉన్నందున, అధికారులు సహాయక బృందాలను అప్రమత్తం చేశారు. ఆఫ్టర్ షాక్స్ (తదుపరి ప్రకంపనలు) వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక యంత్రాంగం సూచించింది.
Read More..






