- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘోర రైలు ప్రమాదం.. 39కి చేరిన మృతుల సంఖ్య
రెండు రైళ్లు ఢీకొనడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: రెండు రైళ్లు ఢీకొనడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటన దక్షిణ స్పెయిన్‌లోని కోర్డోబా ప్రావిన్స్‌లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. మలగా నుంచి మాడ్రిడ్ వెళుతున్న 'ఇరియో' అనే ప్రైవేట్ హైస్పీడ్ రైలు అడముజ్ ప్రాంతం వద్ద పట్టాలు తప్పి, పక్క ట్రాక్‌పైకి దూసుకెళ్లింది. అదే సమయంలో ఎదురుగా మాడ్రిడ్ నుంచి హుయెల్వా వస్తున్న 'రెన్ఫే' సంస్థకు చెందిన మరో రైలును ఇది బలంగా ఢీకొట్టడంతో భారీ ప్రమాదం సంభవించింది.
అయితే.. ఈ రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 39కి చేరింది. పదేళ్ల కాలంలో స్పెయిన్ లో జరిగిన అత్యంత భయంకరమైన రైలు ప్రమాదం ఇదే. ఈ ఘటనలో రెండు రైళ్ల బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు చెబుతున్నారు. సుమారు 100 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాద సమయంలో రెండు రైళ్లలో కలిపి దాదాపు 500 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.
Read More..






