- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజామాబాద్‌లో గంజాయి ముఠా బరితెగింపు.. మహిళా కానిస్టేబుల్‌పై ఘాతుకం
నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠా సభ్యులు రెచ్చిపోయారు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న నిందితులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి హతమార్చే ప్రయత్నం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో గంజాయి ముఠా సభ్యులు రెచ్చిపోయారు. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న నిందితులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళా కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి హతమార్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం సృష్టించింది. నిర్మల్ జిల్లాకు చెందిన ఒక ముఠా కారులో భారీగా గంజాయిని తరలిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిజామాబాద్ శివారులోని మాధవనగర్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి 8 గంటల నిఘా పెట్టారు. పక్కా సమాచారం ప్రకారం అనుమానాస్పదంగా వస్తున్న కారును గుర్తించి, వారిని అడ్డుకునేందుకు మహిళా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య (Sowmya) ముందుకు వెళ్లారు.
మహిళా కానిస్టేబుల్‌పై ఘాతుకం..
పోలీసులను చూసి భయపడిన నిందితులు తప్పించుకోవాలనే ఉద్దేశంతో కారును వేగంగా ముందుకు అలానే పోనిచ్చారు. ఈ క్రమంలో అడ్డుగా ఉన్న సౌమ్యను కారుతో బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న ఆమెను తోటి సిబ్బంది వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించిన ఇద్దరు ముఠా సభ్యులు మహమ్మద్ సొఫియొద్దీన్, సయ్యద్ షోయల్ పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. కారును తనిఖీ చేయగా అందులో భారీగా గంజాయి లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల వెనుక ఉన్న ఇతర నెట్‌వర్క్ గురించి ఆరా తీస్తున్నారు.
Read More..






