- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఆక్రమ ఆస్తులు వంద కోట్లకు పైనే! ఏసీబీ సోదాల్లో వెలుగులోకి కీలక వివరాలు
రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్-రిజిస్ట్రార్ కందాడి మధుసూధన్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 100 కోట్ల రూపాయలకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తుంది.

దిశ, తెలంగాణ బ్యూరో: రంగారెడ్డి జిల్లా జాయింట్ సబ్-రిజిస్ట్రార్ కందాడి మధుసూధన్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో సుమారు 100 కోట్ల రూపాయలకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తుంది. మధుసూధన్ రెడ్డి తన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఫిర్యాదులు రావడంతో అవినీతి నిరోధక చట్టం, కింద కేసు నమోదు చేసి ఏసీబీ దాడులు చేపట్టింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కాప్రా, ఈసీఐఎల్ భవానీ నగర్ కాలనీలోని ఆయన నివాసంలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. బంధువులు, స్నేహితులు, బినామీలు ఇతర సహచరులకు సంబంధించిన ఏడు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. సోదాలు వాణిజ్య స్థలాలు, ఫామ్ హౌస్‌లు, ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములను అధికారులు గుర్తించారు.
కుటుంబ సభ్యుల పేర్ల మీద షెల్ కంపెనీలు
తన అక్రమ సంపాదనను మళ్లించేందుకు కుటుంబ సభ్యుల పేర్ల మీద రెండు షెల్ కంపెనీలను ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. సోదాల సమయంలో భారీగా నగదు, బంగారు ఆభరణాలు కీలకమైన ఆస్తి పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఏసీబీ అధికారికంగా గుర్తించిన ఆస్తుల విలువ రూ.7.83 కోట్లుగా వెల్లడించారు. ఆస్తులు మార్కెట్ విలువ ప్రకారం వందల కోట్లలో ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అదనపు ఆస్తులకు సంబంధించిన తదుపరి తనిఖీలు జరుగుతున్నాయని, కేసు దర్యాప్తులో ఉందని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
ఏసీబీ గుర్తించిన ఆస్తుల వివరాలు ..
- ఈసీఐఎల్ లో 300 చదరపు గజాల్లో నిర్మించిన ట్రిప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ (జీ+2),
- ఇబ్రహీంపట్నం మండలం చింతపల్లిగూడలో ఓపెన్ ప్లాట్,
- పరిగి మండలం నస్కల్ గ్రామంలో 27 ఎకరాల వ్యవసాయ భూమి,
- ఇబ్రహీం పట్నం మండలం మంగళ్‌పల్లి గ్రామంలో ఒక ఎకరం వాణిజ్య భూమి,
- పరిగి మండలం నస్కల్ గ్రామంలో రూ.1.24 కోట్ల విలువైన స్విమ్మింగ్ పూల్‌తో కూడిన ఫామ్ హౌస్.
- రూ.9 లక్షల నగదు, 1.2 కిలోల బంగారు ఆభరణాలు,
- ఫార్చ్యూనర్, వోల్వో ఎక్స్ సీ 60, వోక్స్‌వ్యాగన్ టైగన్ జీటీ ప్లస్ మూడు కార్లు
- ఏఆర్‌కే స్పిరిట్స్ లో రూ.80లక్షల పెట్టుబడి
- భార్య, పిల్లల పేరు మీద రెండు షెల్ కంపెనీలు






