- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మన శంకర వరప్రసాద్ గారు’ అపూర్వ ఆనందాన్ని కలిగించింది: పవన్ కళ్యాణ్
నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఎన్నో సంచలనాలు సృష్టించారు.

దిశ, సినిమా: నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఎన్నో సంచలనాలు సృష్టించారు. ఇక ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్ గారు’(Mana Shankara Vara Prasad Garu)తో మరోసారి సరికొత్త రికార్డులు నెలకొల్పారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi)దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం, సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్ర పోషించడం విశేషం. మెగా అభిమానులతో పాటు, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, చిరంజీవి సినీ ప్రయాణంలో అతి పెద్ద విజయంగా నిలిచింది.
ఈ నేపథ్యంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చెందిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. ‘‘మెగా బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి, అలాగే ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర యూనిట్ మొత్తానికి హృదయపూర్వక శుభాకాంక్షలు. నాలుగు దశాబ్దాలకు పైగా చిరంజీవి గారు ప్రజల హృదయాలకు అత్యంత దగ్గరగా నిలుస్తూ.. అదే తపన, అదే ఉత్సాహంతో తన నటన, హాస్యం, నృత్యాల ద్వారా ప్రేక్షకులను నిరంతరం అలరిస్తున్నారు. ఆయన అద్భుతమైన సినీ ప్రస్థానంలో ఇది మరో విజయవంతమైన చిత్రంగా నిలిచింది. అనిల్ రావిపూడి సంక్రాంతికి మరో ఘన విజయాన్ని అందించిన ఆయన ప్రతిభ ప్రశంసనీయమైనది. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు, విక్టరీ వెంకటేష్ గారు ఒకే తెరపై కలిసి కనిపించడం ప్రేక్షకులకు నిజంగా అపూర్వ ఆనందాన్ని కలిగించింది’’ అని పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేర్కొంది.
Read More..






