ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో అనిల్ రావిపూడి మూవీ ? వ‌చ్చే సంక్రాంతి మాములుగా ఉండ‌దు !

by velandi.Saikiran |   (  Updated:2026-01-22 04:15:32  IST  )

హరిహర వీరమల్లు, OG సినిమాలతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కోసం క్రేజీ స్క్రిప్ట్ సిద్ధం చేశాడట అనిల్ రావిపూడి.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో అనిల్ రావిపూడి మూవీ ? వ‌చ్చే సంక్రాంతి మాములుగా ఉండ‌దు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క ఫ్లాప్‌ లేకుండా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి, మరో అదిరిపోయే ప్రాజెక్టుతో సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ గా మారింది. బాలయ్య, విక్టరీ వెంకటేష్, మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ హీరోలకు బంపర్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట. హరిహర వీరమల్లు, OG సినిమాలతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ కోసం క్రేజీ స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. అది కూడా దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ సినిమా రాబోతున్నట్లు టాక్ నడుస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన రాబోతున్నాయి ఈ సినిమా బడ్జెట్ దాదాపు 500 కోట్లు అని అంటున్నారు.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో పాటు ఫుల్ కామెడీ ఉండేలా ఈ కథ సిద్ధం చేశారట అనిల్ రావిపూడి. ఈ మేరకు పవన్ కళ్యాణ్ తో కూడా చర్చలు జరుగుతున్నాయట. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తర్వాత అనిల్ తో సినిమా చేసేందుకు పవన్ కళ్యాణ్ కూడా సిద్ధమవుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఒకవేళ వీళ్ళ కాంబినేషన్ ఓకే అయితే, వచ్చే సంక్రాంతి మామూలుగా ఉండబోదని సోషల్ మీడియాలో కామెంట్లు కూడా పెడుతున్నారు. అయితే మరికొంతమంది మాత్రం నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ అస్సలు సెట్ కాదని... మరికొంతమంది ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. మరి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందో? రూమర్ గా నిలుస్తుందో చూడాలి.

చిరంజీవి సినిమాతో అనిల్ మరో హిట్

చిరంజీవి హీరోగా మన శంకర వరప్రసాద్ గారు సినిమాను తెరకెక్కించారు అనిల్. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా.. వెంకీ మామ స్పెషల్ రోల్ చేశారు. ఈ మూవీ ఇప్పటికే 300 కోట్లు క్రాస్ చేసి ఇరగదీస్తోంది.

Read More..

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మ‌రో సాంగ్‌..ఇక పూన‌కాలు రావాల్సిందే !

Next Story