- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మరో సాంగ్..ఇక పూనకాలు రావాల్సిందే !
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఓ అదిరిపోయే మాస్ సాంగ్ రాబోతుందట.

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ రానుంది. ఇప్పటికే హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ సినిమా వచ్చి బ్లాక్ బాస్టర్ అయింది. ఇప్పుడు ఈ సినిమా పైన అంచనాలు భారీగానే ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఈ సినిమా రానుండగా... దేవి శ్రీ ప్రసాద్ సంగీత స్వరాలు అందిస్తున్నారు.
ఈ సినిమా తమిళ చిత్రం తేరికి రీమేక్ అంటున్నారు. కానీ ఆ సినిమా కథలో భారీ మార్పులు చేసి తెలుగులో రిలీజ్ చేసేందుకు హరీష్ శంకర్ చాలా కష్టపడుతున్నారట. ఆ సినిమాకు.. ఈ మూవీకి కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుందట. అయితే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది.
పవన్ కళ్యాణ్ సినిమా నుంచి అదిరిపోయే సాంగ్
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఓ అదిరిపోయే మాస్ సాంగ్ రాబోతుందట. ఈ మేరకు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. ఇక ఈ పాటకు లిరిక్స్ రాసింది ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్ర బోస్ అంటూ వెల్లడించింది చిత్ర బృందం. ఈ పాటను అతి త్వరలోనే రిలీజ్ చేయనున్నారట. కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్నారు. రాశి ఖన్నా కూడా ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం.
Read More..






