గవర్నర్ ఆనంద బోస్ రాజీనామాపై మమతా బెనర్జీ దిగ్భ్రాంతి.. కేంద్రంపై తీవ్ర ఆరోపణలు

by Malleboina Mahesh |   (  Updated:2026-03-06 11:05:13  IST  )

పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద బోస్ ఆకస్మిక రాజీనామాపై సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర హోం మంత్రి ఒత్తిడి వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని ఆమె ఆరోపించారు.

గవర్నర్ ఆనంద బోస్ రాజీనామాపై మమతా బెనర్జీ దిగ్భ్రాంతి.. కేంద్రంపై తీవ్ర ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ గవర్నర్ సి.వి. ఆనంద బోస్ (C.V. Ananda Bose) ఎవరూ ఊహించని విధంగా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం (President's approval) తెలిపారు. కాగా ఆయన నిర్ణయంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్రంగా స్పందించారు. ఆయన తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఆనంద బోస్ తన పదవికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో ఇప్పటికీ తనకు అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే.. ఈ ఆకస్మిక రాజీనామా వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటూ మమతా బెనర్జీ (Mamata Banerjee) సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) ఒత్తిడి కారణంగానే గవర్నర్ తన పదవిని వీడాల్సి వచ్చిందని ఆమె విమర్శించారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిపై కేంద్రం ఇలాంటి ఒత్తిళ్లు తీసుకురావడం సరికాదని ఆమె ఈ సందర్భంగా పరోక్షంగా అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన రాజీనామా చేడయంపై అనేక అంశాలపై రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

కుగ్రామం నుంచి ‌లోక్‌భవన్ వరకు.. గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లా ప్రస్థానం ఇదే!

Next Story