- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుగ్రామం నుంచి లోక్‌భవన్ వరకు.. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రస్థానం ఇదే!
తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాజకీయ ప్రస్థానం, వ్యక్తిగత విశేషాలపై ప్రత్యేక కథనం..

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్‌గా అనుభవజ్ఞులైన రాజకీయవేత్త, మాజీ కేంద్ర మంత్రి శివ ప్రతాప్ శుక్లా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన ఆయనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
గోరఖ్‌పూర్ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ జిల్లా రుద్రాపూర్ గ్రామంలో ఏప్రిల్ 1, 1952లో శివ ప్రతాప్ శుక్లా జన్మించారు. గోరఖ్‌పూర్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రం (LLB) పట్టా పొందారు. విద్యార్థి దశలోనే రాజకీయాల పట్ల ఆకర్షితులైన ఆయన 1970లో అభిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) ద్వారా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1975లో అత్యవసర పరిస్థితి (Emergency) సమయంలో మీసా (MISA) చట్టం కింద దాదాపు 19 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు.
రాజకీయ ప్రస్థానం..
విద్యార్థి సంఘం నాయకుడి ఉన్న శివ ప్రతాప్ శుక్లా అనంతరం బీజేపీలో చేరారు. అక్కడ నిబద్ధత కలిగిన నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.1989 నుంచి 1996 వరకు వరుసగా నాలుగు సార్లు గోరఖ్‌పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కళ్యాణ్ సింగ్, రామ్ ప్రకాష్ గుప్త, రాజ్‌నాథ్ సింగ్ మంత్రివర్గాల్లో జైళ్లు, న్యాయశాఖ, గ్రామీణాభివృద్ధి, ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా సేవలందించారు. 2017 నుంచి 2019 వరకు ప్రధాని మోదీ మొదటి ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
గవర్నర్‌గా బాధ్యతలు
ఫిబ్రవరి 2023లో హిమాచల్ ప్రదేశ్ 22వ గవర్నర్‌గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా అక్కడ తనదైన ముద్ర వేశారు. తాజా మార్పుల్లో భాగంగా జిష్ణు దేవ్ వర్మ స్థానంలో ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. సౌమ్యుడిగా, క్రమశిక్షణ గల నాయకుడిగా గుర్తింపు పొందిన శివ ప్రతాప్ శుక్లా రాకతో తెలంగాణ రాజ్‌భవన్‌లో నూతన అధ్యాయం మొదలైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గవర్నర్ ఆనంద బోస్ రాజీనామాపై మమతా బెనర్జీ దిగ్భ్రాంతి.. కేంద్రంపై తీవ్ర ఆరోపణలు
- Tags
- Shiv Pratap Shukla
- Governor of Telangana
- Telangana Raj Bhavan
- BJP Veteran
- Former Union Minister
- Himachal Pradesh Governor
- UP Politics
- Gorakhpur Urban MLA
- Indian Statesman
- Appointment of Governors
- Droupadi Murmu
- Telangana Government News
- Political Career of Shiv Pratap Shukla
- MISA 1975
- ABVP Leader
- Finance Ministry India






