- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కల్వకుంట్ల కవితను చెల్లెగా గౌరవిస్తా.. మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు. శుక్రవారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ చేశారు. వ్యక్తిగత హననం చేస్తున్నారని కేటీఆర్ అనడం హాస్యాస్పదమని విమర్శించారు. రాజ్యాంగం ప్రకారం విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. రాజకీయ కక్ష్య సాధింపు ధోరణి ఉంటే అధికారంలోకి రాగానే చర్యలు ఉండేవి అని అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌పై కేటీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ వినడం వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమే అని అన్నారు. కేటీఆర్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.
కేటీఆర్ మాటలు వింటుంటే నవ్వొస్తుంది
అలీ బాబా 420 దొంగల మాదిరి కేసీఆర్ కుటుంబం దోపిడీకి పాల్పడింది. స్టువర్ట్ పురం దొంగల బ్యాచ్ బీఆర్ఎస్. కార్తీకదీపం గురించి తర్వాత.. ముందు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దీపం ఆగిపోకుండా చూసుకోవాలి. ఫోన్ల ట్యాపింగ్‌పై కేటీఆర్ మాట్లాడటం హాస్యాస్పదం. తోడ బుట్టిన చెల్లెలు కవిత ఫోన్ ట్యాప్ చేశారని గగ్గోలు పెడుతుంటే ఇప్పటివవరకూ సమాధానం చెప్పలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా తీవ్రమైంది. దీనిని ఉద్యమ కేసులతో పోల్చడం సరికాదు. అధికారులకు పరిమితులు ఉంటాయి. కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్ కుటుంబంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్‌ను సూటిగా అడుగుతున్నా. బీజేపీ నేతల ఈడీ కేసులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి.
సినిమా వాళ్ల ఫోన్‌లో ఏం పని?
దేశ భద్రతకు విఘాతం కలిగించే శక్తులపై మాత్రమే ట్యాపింగ్ చేస్తారు. నక్సలైట్లతో లావాదేవీలు జరుపుతున్నారని నాపై నిఘా పెట్టీ ట్యాపింగ్ చేశారు. సినీ తారల ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముంది. కల్వకుంట్ల కవితను నేను చెల్లెలుగా ఎప్పుడూ గౌరవిస్తా. కేసీఆర్ కుటుంబంలో తగాదాలకు మూలం వాటాల పంపకంలో తేడానే. కవిత ఇప్పటికైనా నిజాలు మాట్లాడుతున్నాందుకు స్వాగతిస్తున్నాం. బీఆర్ఎస్ హయంలో కేవలం మూడు నెలల్లో 547 ఫోన్లు ట్యాప్ అయ్యాయి. నా మిత్రుడు ఫోన్ సైతం ట్యాప్ అయ్యింది. ఏఐసీసీ ఇంచార్జీ మార్పు ఉండదు’ అని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.






