- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుటుంబాలకు కుటుంబాలు నాశనం చేశారు.. బీఆర్ఎస్‌పై రెచ్చిపోయిన మహేశ్ కుమార్ గౌడ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతున్న వేళ బీఆర్ఎస్ నేతలు అతిఉత్సాహం ప్రదర్శిస్తున్నరాని కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతున్న వేళ బీఆర్ఎస్ నేతలు అతిఉత్సాహం ప్రదర్శిస్తున్నరాని కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) విమర్శలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అంటే బ్లాక్ మెయిల్ రాష్ట్ర సమితి. గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అరాచక పాలనపై విచారణలు జరుగుతున్నాయని అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో ప్రమేయం ఉన్నటువంటి నేతలు విచారణకు హాజరు అవుతున్నారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ఘోరమైన నేరమని అభివర్ణించారు. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు మాదిరి కేసీఆర్‌కు సిట్ ఎదుట హాజరు అవుతున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు ఎందుకు హడావిడి చేస్తున్నారో తెలియడం లేదని ఎద్దేవా చేశారు.
కేసీఆర్‌ది రాజరిక పాలన
కేసీఆర్ విచారణను భూతద్దంలో చూడటం హాస్యాస్పదం.. కేసీఆర్ నీతిమంతుడనీ, అన్యాయమనీ అనడం గగ్గోలు పెట్టడం మరీ తెలివిలేనితనమని విమర్శించారు. కేసీఆర్ రాజరిక పాలనలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు. చట్టం ముందు అందరూ సమానులే. చట్టం తన పని తాను చేసుకుంటే పోతుంటే నిందలు వేయడం విచారకరం. చట్టం ఎవరికీ చుట్టం కాదు. గతంలో శిబూ సోరెన్, మాయావతి, జయలలిత, లాలు ప్రసాద్ యాదవ్, యడ్యురప్ప లాంటి ముఖ్యమంత్రులు విచారణలు ఎదుర్కొన్నారని మహేశ్ కుమార్ గౌడ్ గుర్తుచేశారు.
టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం విపత్కర పరిస్థితుల్లో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయాలి. కానీ బీఆర్ఎస్ పాలనలో ఇందుకు భిన్నంగా జరిగింది. పారిశ్రామిక వేత్తలు, సినీతారల ఫోన్ ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ చేశారు. ఫోన్ ట్యాప్‌తో భార్య భర్తల సంసారాల్లో తొంగి చూశారని మహేశ్ గౌడ్ మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిన వారు ఎంతంటి వారైనా శిక్షర్హులే అన్నారు.






