- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిట్ విచారణ అంటే ఎందుకు అంత భయం? : మంత్రి అడ్లూరి
సిట్ విచారణ అంటే ఎందుకు అంత భయం? అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, సిట్ అధికారుల విచారణపై మంత్రి స్పందించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: సిట్ విచారణ అంటే ఎందుకు అంత భయం? అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, సిట్ అధికారుల విచారణపై మంత్రి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారని విమర్శించారు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు కాబట్టే సెంటిమెంట్‌తో ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధించాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే ఈ రెండేళ్లు మీరు రోడ్డు మీద తిరిగేవాళ్లు కాదని మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు చేసిన పాపాలకు మూల్యం చెల్లుంచుకోవాలని, చట్టం తన పని తాను చేసుకంటూ పోతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ ప్రారంభమైంది. సిట్ నోటీసుల నేపథ్యంలో నంది నగర్ నివాసంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ప్రారంభమైంది. ఫోన్ ట్యాపింగ్ అంశంపై మొత్తం 15 మంది అధికారుల బృందం ఆయనను ప్రశ్నిస్తోంది.






