- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లోక్‌సభ సమావేశం వాయిదా
లోక్‌సభ సమావేశం వాయిదా పడింది. చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతోందని ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే తన పుస్తకంలో రాసిన కొన్ని అంశాలను ఓ మ్యాగజైన్ ప్రచురించింది.

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ సమావేశం వాయిదా(Lok Sabha Postponed) పడింది. చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతోందని ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే తన పుస్తకంలో రాసిన కొన్ని అంశాలను ఓ మ్యాగజైన్ ప్రచురించింది. ఆ వివరాలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) లోక్‌సభలో ప్రస్తావించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్ ఖండించారు. రాహుల్ చెబుతున్న పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదని.. ప్రచురితం కాని పుస్తకంలోని అంశాల గురించి ఎలా మాట్లాడతారని రాజ్‌నాథ్ సింగ్ ప్రశ్నించారు. అనంతరం రాహుల్‌పై స్పీకర్ ఓంబిర్లా(Lok Sabha Speaker Om Birla) సైతం మండిపడ్డారు. రాహుల్ హోదాకు తగ్గట్లు మాట్లాడటం లేదని అన్నారు. తీవ్ర గందరగోళం అనంతరం సభను సాయంత్రం నాలుగు గంటలకు స్పీకర్ వాయిదా వేశారు. మరోవైపు రాహుల్ మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.






