లోక్‌‌సభలో గందరగోళం.. రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకున్న BJP సభ్యులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-02 10:43:42  IST  )

లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యలపై ఇవాళ సభలో గందరగోళం నెలకొంది.

లోక్‌‌సభలో గందరగోళం.. రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకున్న BJP సభ్యులు
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) వ్యాఖ్యలపై ఇవాళ సభలో గందరగోళం నెలకొంది. పొరుగు దేశం చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతోందని మాజీ ఆర్మీ చీఫ్ రాసిన పుస్తకంలోని అంశాలను రాహుల్ గాంధీ సభలో ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఆయన ప్రస్తావించిన పుస్తకం ఇంకా పబ్లిష్ కూడా కాలేదని రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ప్రచురించని పుస్తకంలోని అంశాలపై ఎలా మాట్లాడతారంటూ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ (Rajnath Singh) సింగ్ ఫైర్ అయ్యారు.

అదేవిధంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు సభను అవమానించేలా ఉన్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) ఖండించారు. అనంతరం రాహుల్ మాట్లాడుతుండగా.. మైక్ కట్ చేశారంటూ కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశభక్తి ఎవరికి ఎంత ఉందో ప్రజలకు తెలుసని కామెంట్ చేశారు. దీంతో సభ ఇరు పక్షాల స్లోగన్స్‌తో హోరెత్తింది. పరిస్థితి గమనించిన స్పీకర్ ఓం బిర్లా, రాహుల్ గాంధీని రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై మాట్లాడాలని సూచించినా వినకపోవడంతో, ఆయన లోక్‌సభను సాయంత్రం 4 గంటల వరకు వాయిదా వేశారు.

లోక్‌సభ సమావేశం వాయిదా

Next Story