- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ స్టార్ హీరో వల్ల జీవితమే నరకం.. ఆ ఏడాది ఓ పీడకల అంటూ కంగనా సెన్సేషనల్ పోస్ట్!
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా(Kangana Ranaut) నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. సంచలన పోస్టులు పెడుతోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా(Kangana Ranaut) నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. సంచలన పోస్టులు పెడుతోంది. పలు విషయాలపై తనదైన స్టైల్లో స్పందిస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా, కంగనా రనౌత్ 2026కు వెల్‌కమ్ చెప్తూ.. తన జీవితంలో జరిగిన ఓ చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 20216లో తన జీవితంలో ఎక్కువ ఇబ్బంది పెట్టిన సంవత్సరంగా.. దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ నోట్ పెట్టింది. ‘‘అకస్మాత్తుగా అందరూ 2016 సంవత్సరాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు?..క్వీన్, తను వెడ్స్ మను సినిమాలతో ఘన విజయాలు అందుకుని అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నాకు 2016 జనవరిలో ఓ పెద్ద షాక్ తగిలింది.
ఓ స్టార్ హీరో నాకు లీగలు నోటీసులు పంపాడు. ఓ ఇంటర్వ్యూలో నేను అతన్ని నా ఎక్స్‌గా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని నోటీసులు పంపాడు. అందుకు నేను ఒప్పుకోలేదు కోర్టుల చుట్టూ తిరగాను. అది ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. దానివల్లే ఇన్‌సైడర్స్, ఔట్‌సైడర్స్ అని రెండుగా ఇండస్ట్రీ విడిపోయింది. విజయం విషపూరితమైజజ జీవితమే నరకంలా మారింది. ఎన్నో న్యాయపోరాటాలు చేయాల్సి వచ్చింది. 2026లో ఇలా హ్యాపీగా ఉంటానని.. ఆ వివాదాన్ని కొంతకాలానికే అందరూ మర్చిపోతారని అప్పుడే తెలిసుంటే అంత బాధపడి ఉండేదాన్ని కాదు. ఇప్పుడు 2016లో కాకుండా 2026లో ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని రాసుకొచ్చింది. అయితే ఆ స్టార్ హీరో మరెవరో కాదు హృతిక్ రోషన్(Hrithik Roshan). వీరిద్దరు ప్రేమించుకోగా.. మనస్పర్థలు తలెత్తడంతో బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. ఆ తర్వాత తనను ఎక్స్‌గా చెప్పడం తనకు నచ్చక నోటీసులు పంపినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
Read More..
Kangana Ranaut: ద్వేషంతో మీ కళ్లు మూసుకుపోయాయి.. ఏఆర్ రెహమాన్‌పై కంగనా సంచలన పోస్ట్






