- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kangana Ranaut: ద్వేషంతో మీ కళ్లు మూసుకుపోయాయి.. ఏఆర్ రెహమాన్‌పై కంగనా సంచలన పోస్ట్
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్(AR Rahman) బాలీవుడ్ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

దిశ, సినిమా: స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్(AR Rahman) బాలీవుడ్ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. తనను బాలీవుడ్ కావాలనే దూరం పెట్టిందని, అందుకు మతపరమైన కారణాలే కారణమని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారి తీశాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut)తీవ్ర స్థాయిలో స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఏఆర్ రెహమాన్‌ను ఉద్దేశించి కంగనా ఘాటు వ్యాఖ్యలతో కూడిన సంచలన పోస్ట్ చేశారు. తాను ఒక రాజకీయ పార్టీకి మద్దతు ఇస్తున్న కారణంగా సినీ పరిశ్రమలో ఎన్నోసార్లు వివక్షను ఎదుర్కొన్నానని పేర్కొన్న ఆమె, “మీ స్థాయిలో పక్షపాతం, ద్వేషం చూపించే వ్యక్తిని నేను ఇప్పటివరకు చూడలేదు” అంటూ తీవ్రంగా విమర్శించారు.
తాను దర్శకత్వం వహించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ఎమర్జెన్సీ సమయంలో రెహమాన్‌కు కథ వివరించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినట్లు కంగనా వెల్లడించారు. అయితే కథ వినడం సంగతి పక్కన పెడితే, తనను కలవడానికి కూడా ఆయన నిరాకరించారని ఆరోపించారు. ఈ సినిమాను ‘ప్రొపగాండా ఫిల్మ్’గా భావించి దానికి దూరంగా ఉన్నారని తనకు చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే ఎమర్జెన్సీ విడుదలైన తర్వాత అన్ని వర్గాల నుంచి మంచి ప్రశంసలు లభించాయని, ప్రతిపక్ష నేతలు కూడా ఈ చిత్రాన్ని సమతుల్యంగా, మానవీయంగా తెరకెక్కించారంటూ అభినందించారని కంగనా తెలిపారు.
అలాంటి సినిమాపై ముందే అభిప్రాయం ఏర్పరుచుకుని తిరస్కరించడం బాధాకరమని వ్యాఖ్యానించారు. “ద్వేషంతో కళ్లు మూసుకుని ఒక మంచి సినిమాను ముందే పక్కన పెట్టడం నాకు ఎంతో వేదన కలిగించింది. నా కెరీర్‌లో అవకాశాలు తగ్గడానికి కూడా కమ్యూనల్ వివక్షే కారణమై ఉండవచ్చని భావిస్తున్నాను” అని సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. ఇక ఈ విషయం గురించి తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా చర్చించుకోవడం మొదలెట్టారు.
Read More..
అయితే తిరిగి హిందూ మతంలోకి రండి.. రెహమాన్ వ్యాఖ్యలకు విశ్వహిందూ పరిషత్ కౌంటర్






