అయితే తిరిగి హిందూ మతంలోకి రండి.. రెహమాన్ వ్యాఖ్యలకు విశ్వహిందూ పరిషత్ కౌంటర్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-01-18 04:26:50  IST  )

విశ్వ హిందూ ప‌రిష‌త్ నేత వినోద్ బ‌న్స‌ల్ సైతం రెహ‌మాన్ వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. రెహ‌మాన్ తిరిగి హిందూమ‌తంలోకి రావాల‌ని సూచించారు. ఒక నిర్ధిష్ట వ‌ర్గంతో రెహ‌మాన్ పొత్తుపెట్టుకున్నార‌ని బన్సాల్ ఆరోపించారు.

అయితే తిరిగి హిందూ మతంలోకి రండి.. రెహమాన్ వ్యాఖ్యలకు విశ్వహిందూ పరిషత్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి. ఎనిమేదేళ్లుగా తనను బాలీవుడ్ వెలివేసిందని రెహమాన్ అన్నారు. హిందీ ఫీల్డ్ లో క్రియేటివిటీ పర్సంటేజ్ తక్కువ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మతపరమైన అంశం కూడా తనపై వివక్ష చూపేందుకు కారణం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవకాశాల కోసం తాను ఒకరి వద్దకు వెళ్లనని తన వద్దకే అవకాశాలు వచ్చేలా చేసుకుంటానని చెప్పారు. వృత్తిప‌ట్ల ఉన్న నిబద్ధ‌తే త‌న‌కు అవ‌కాశాలు తెచ్చి పెడుతుంద‌ని భావిస్తాన‌ని అన్నారు. ఇక రెహ‌మాన్ చేసిన వ్యాఖ్య‌లు వివాదాస్ప‌దంగా మార‌డంతో ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు ఖండిస్తున్నారు. ఇప్ప‌టికే హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్, నిర్మాత జావేద్ అక్త‌ర్ ఖండించారు.

కాగా తాజాగా విశ్వ హిందూ ప‌రిష‌త్ నేత వినోద్ బ‌న్స‌ల్ సైతం రెహ‌మాన్ వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. రెహ‌మాన్ తిరిగి హిందూమ‌తంలోకి రావాల‌ని సూచించారు. ఒక నిర్ధిష్ట వ‌ర్గంతో రెహ‌మాన్ పొత్తుపెట్టుకున్నార‌ని బన్సాల్ ఆరోపించారు. ఒక‌ప్పుడు మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి హ‌మీద్ అన్సారీ నాయ‌కుడిగా ఉన్న వ‌ర్గానికి రెహ‌మాన్ కూడా నాయ‌కుడిగా మారిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని అన్నారు. అన్సారీ 10ఏళ్లు రాజ‌కీయ ప‌దువులు అనుభ‌వించార‌ని ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర‌వాత భార‌త్ ను నిందించార‌న్నారు. రెహ‌మాన్ ను ఒక‌ప్పుడు భారతీయులు, హిందూమ‌త‌స్తులు ఆరాధించార‌ని ఇప్పుడు ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకోకుండా వ్య‌వ‌స్థ గురించి చెడుగా మాట్లాడి ఇండ‌స్ట్రీని కించప‌రుస్తున్నార‌ని అన్నారు. రెహ‌మాన్ ఒక‌ప్పుడు హిందువు.. మతం ఎందుకు మారార‌ని ప్ర‌శ్నించారు. తిరిగి గ‌ర్ వాప‌సీ చేస్తే అవ‌కాశాలు రావొచ్చ‌ని వ్యాఖ్యానించారు.

Read More..

Kangana Ranaut: ద్వేషంతో మీ కళ్లు మూసుకుపోయాయి.. ఏఆర్ రెహమాన్‌పై కంగనా సంచలన పోస్ట్

Next Story