నోటీసులు అందాయి.. కేటీఆర్ విచారణకు వస్తారు: అడ్వొకేట్

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-22 13:28:45  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు అందాయి.

నోటీసులు అందాయి.. కేటీఆర్ విచారణకు వస్తారు: అడ్వొకేట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)కు నోటీసులు అందాయి. 160 సీఆర్పీసీ కింద సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో విచారణకు కేటీఆర్ హాజరు అవుతారని అడ్వొకేట్ సోమ భరత్‌(Advocate Soma Bharath) స్పష్టం చేశారు. ఈ కేసులో చట్టబద్ధంగానే న్యాయపోరాటం చేస్తామని సోమ భరత్‌ తెలిపారు.

ఎవరీ భరత్...

భరత్ కుమార్ స్వస్థలం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని వర్ధమానుకోట గ్రామం. వృత్తి రీత్యా లాయర్. తెలంగాణ ఉద్యమంలో కూడా భరత్ చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్‌ఎస్ పార్టీకి న్యాయపరంగా ఎదురైన చిక్కులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు. పార్టీ వ్యవహారాల్లో కూడా యాక్టివ్‌గా వ్యవహరించడంతో సోమా భరత్ కుమార్‌కు కేసీఆర్ పార్టీలో లీగల్ సెల్ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. 2022లో తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ (TSDDCF) చైర్మన్‌గానూ భరత్ బాధ్యతలు నిర్వర్తించారు.

Read More... ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. కేటీఆర్‌కు సిట్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పేం కాదు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

Next Story