Komatireddy Venkat Reddy: ఇకపై రేవంత్ రెడ్డి ముఖం చూడను.. వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
TPCC Chief Revanth Reddy Says Sorry to MP Komatireddy Venkat Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: Komatireddy Venkat Reddy Express Impatience Over Revanth Reddy| టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన ఉద్యమనేత చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని.. రేవంత్ రెడ్డి చాలా పెద్ద తప్పు చేశారని అన్నారు. తనను ఓడించాలనుకున్న చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్ పార్టీలో ఎలా చేర్చుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఇకపై రేవంత్ రెడ్డి ముఖం కూడా చూడనని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల తర్వాతే.. మునుగోడు నియోజకవర్గానికి వెళ్తానని తెలిపారు. తాను ఇవాళ చండూరులో కాంగ్రెస్ నిర్వహించబోయే బహిరంగ సభకు వెళ్లటం లేదని తేల్చి చెప్పారు.

మునుగోడు ఉపఎన్నికకు అప్పుడే తొందర ఎందుకని.. దానికి ఇంకా సమయం ఉందన్నారు. హుజురాబాద్ ఉపఎన్నికకు చివరి రోజు నామినేషన్ వేయించినట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీంతో వెంకట్ రెడ్డి వ్యవహార శైలిపై కాంగ్రెస్ నేతల్లో, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తనకు మధ్య అగాధం సృష్టించేందుకు కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారని, మా మధ్య ఎలాంటి గొడవలు లేవని, వెంకట్ రెడ్డి నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్త అంటూ రేవంత్ రెడ్డి కొంత సేపటి క్రితమే మాట్లాడి వెంకట్ రెడ్డిని కలుపుకొని పోయే ప్రయత్నం చేయగా.. వెంకట్ రెడ్డి ఏమాత్రం తగ్గకపోవడం ఆసక్తి రేపుతోంది.

ఇది కూడా చదవండి: బీజేపీకి టచ్‌లో వెంకట్ రెడ్డి.. క్లారిటీ ఇచ్చిన Bandi Sanjay


Next Story