ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్

by Jakkula.Mamatha |

జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్
X

దిశ, కథలాపూర్: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు సేకరణ ప్రక్రియ పర్యవేక్షణలో భాగంగా కథలాపూర్ మండలం కలికోట గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన వెంటనే తూకం వేసి ఆలస్యం లేకుండా మిల్లులకు తరలించాలని సూచించారు.

అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తూ పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. అలాగే తూకం, నిల్వ, రవాణా ప్రక్రియల్లో ఎక్కడ కూడా నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన డేటా ఎంట్రీని వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేసి రైతుల ఖాతాల్లో సకాలంలో చెల్లింపులు జమయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. అలాగే మిల్లులకు చేరిన ధాన్యాన్ని 24 గంటల్లోపు అన్‌లోడింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్ డి ఓ.జివాకర్ రెడ్డి, సంధాని, జితేందర్ రెడ్డి, తహసీల్దార్ గుగ్గిళ్ల రమేష్ గౌడ్, తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story