కోర్టు తీర్పుల్లో ఏఐ వాడకంపై సుప్రీంకోర్టు నిషేధం.. సంచలన డ్రాఫ్ట్ రూల్స్ విడుదల

by Kema Shiva Kumar |

కోర్టు తీర్పులలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకంపై సుప్రీంకోర్టు పూర్తిగా నిషేధం విధించింది.

కోర్టు తీర్పుల్లో ఏఐ వాడకంపై సుప్రీంకోర్టు నిషేధం.. సంచలన డ్రాఫ్ట్ రూల్స్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: భారత న్యాయవ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగానికి సంబంధించి సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన కీలక నిర్ణయం తీసుకున్నది. ఇక నుంచి కోర్టు తీర్పులు ఇవ్వడంలో, కీలకమైన న్యాయపరమైన నిర్ణయాలు (Judicial Decisions) తీసుకోవడంలో ఏఐ (AI)ని ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేధిస్తూ సుప్రీంకోర్టు కొత్త డ్రాఫ్ట్ రూల్స్ (Draft Rules)ను రూపొందించింది. అయితే, న్యాయ నిర్ణయాధికారం అనేది కేవలం మానవ మేధస్సుకు, అనుభవజ్ఞులైన న్యాయమూర్తులకు (Human Judges) మాత్రమే పరిమితం కావాలని, ఇందులో యంత్రాల జోక్యం అక్కర్లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.

డ్రాఫ్ట్ రూల్స్‌లోని ప్రధానాంశాలు ఇవే..

న్యాయపరమైన నిర్ణయాలు తీసుకోవడం, సాక్ష్యాధారాలను అంచనా వేయడం, తీర్పులు (Judgments/Orders) రాయడం వంటి ప్రధాన విధుల్లో ఏఐ టూల్స్ లేదా అల్గారిథమ్‌లను అస్సలు ఉపయోగించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏఐ సాంకేతికతను కేవలం కేసుల పరిశోధన (Legal Research), వివిధ భాషల్లోకి అనువాదాలు (Translations), కోర్టు రికార్డుల డిజిటలైజేషన్, కేస్ మేనేజ్‌మెంట్ వంటి పరిపాలనా పరమైన పనులకు మాత్రమే పరిమితం చేయాలని పేర్కొంది. కోర్టు కార్యకలాపాలలో ఏఐని ఎక్కడైనా ఉపయోగించినప్పుడు పూర్తి పారదర్శకత ఉండాలని, డేటా భద్రత, ప్రైవసీకి ఎలాంటి భంగం కలగకూడదని నిబంధనలలో స్పష్టంగా పేర్కొన్నారు. ఏఐ వల్ల న్యాయ వ్యవస్థ నిష్పాక్షికత దెబ్బతినే ప్రమాదం ఉందనే ఉద్దేశంతోనే సుప్రీంకోర్టు ఈ కఠిన డ్రిఫ్ట్ రూల్స్ తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది.

Next Story