- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పడిపోతేనే స్పందిస్తారా..?
మూడు సంవత్సరాలుగా గ్రామస్తులు ఎన్నిసార్లు చెప్పినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో డోంగ్లి గ్రామ శివారులో కరెంట్ స్తంభం ప్రమాదకరంగా వంగి పోయి పడిపోయే స్థితిలో ఉంది.

X
దిశ, డోంగ్లి (మద్నూర్) : మూడు సంవత్సరాలుగా గ్రామస్తులు ఎన్నిసార్లు చెప్పినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో డోంగ్లి గ్రామ శివారులో కరెంట్ స్తంభం ప్రమాదకరంగా వంగి పోయి పడిపోయే స్థితిలో ఉంది. పొలాల మధ్య ఉన్న ఈ స్తంభం ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదంలో ఉండటంతో రైతులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వైర్లు తెగి ప్రమాదం జరిగే అవకాశం ఉన్నా విద్యుత్ అధికారులు స్పందించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్లుగా అధికారులకు చెబుతూనే ఉన్నాం. ఇప్పటికైనా స్తంభాన్ని మార్చి ప్రమాదాన్ని నివారించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Next Story






