- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రణాళికబద్ధంగా డివిజన్ల అభివృద్ధి
పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని 9 డివిజన్ల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయిస్తూ.. మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.

దిశ, రామచంద్రాపురం : పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని 9 డివిజన్ల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా నిధులు కేటాయిస్తూ.. మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం తెల్లాపూర్ డివిజన్ పరిధిలో గల హుడా కమాన్ నుండి రేడియం రోడ్డు వరకు గల ప్రధాన రహదారి మీడియన్, పాత్ వే కోసం 87 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలని కోరుతూ ఇటీవల సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన ను సైతం కలిసి విన్నవించడం జరిగిందని తెలిపారు. అతి త్వరలో ప్రతి డివిజన్ అభివృద్ధికి నిధులు మంజూరు కాబోతున్నాయని తెలిపారు. శరవేగంగా ఏర్పడుతున్న నూతన కాలనీలలో సైతం మౌలిక వసతులు కల్పనకు నిధులు కేటాయించబోతున్నట్లు తెలిపారు. తెల్లాపూర్ పరిధిలో.. వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సోమిరెడ్డి, దేవేందర్ యాదవ్, మాజీ కౌన్సిలర్లు లచ్చి రామ్ నాయక్, బాబ్జి, శ్రీశైలం, శ్రీకాంత్, ఉమేష్, రవీందర్ రెడ్డి, నాగరాజు, బల్దియా ఇంజనీరింగ్ విభాగం డిఈ కృష్ణవేణి, బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






