- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్డీయే కూటమి కీలక సమావేశం: రెండేళ్ల ప్రగతిపై చర్చ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజరయ్యారు..

దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు(Cm Chandrababu) అధ్యక్షతన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల(NDA partner parties) కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Jana Sena chief and Deputy CM Pawan Kalyan), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్(BJP State President Madhav) హాజరయ్యారు. ప్రభుత్వ రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో, సాధించిన విజయాలను, ప్రజాసంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం.
రాజ్యసభ స్థానాల భర్తీ.. జనసేనకు ఒక సీటు?
మరోవైపు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో, అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో చర్చించారు. కూటమిలోని పార్టీల బలాబలాల ఆధారంగా సీట్ల సర్దుబాటుపై కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జనసేన పార్టీకి ఒక రాజ్యసభ స్థానాన్ని కేటాయించేందుకు కూటమి పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.






