బ్యాటరీ దొంగల అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు

by Jakkula.Mamatha |

జగిత్యాల అర్బన్ ధరూర్ గ్రామ శివారులోని అంబేద్కర్ చౌరస్తాలో బ్యాటరీ దొంగల అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ సీఐ సుధాకర్ తెలిపారు.

బ్యాటరీ దొంగల అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు
X

దిశ, జగిత్యాల రూరల్: జగిత్యాల అర్బన్ ధరూర్ గ్రామ శివారులోని అంబేద్కర్ చౌరస్తాలో బ్యాటరీ దొంగల అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ సీఐ సుధాకర్ తెలిపారు. ధరూర్ గ్రామ శివారులో ఈరోజు రూరల్ పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా TG21T1774 నెంబర్ గల ఆటోను తనిఖీ చేయగా అందులో 39 బ్యాటరీలు 4 యు.పి.ఎస్ పవర్ సప్లయర్లు ఉన్నట్లు గుర్తించి వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా బ్యాటరీలు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారని ఆయన తెలిపారు.

A-1 బండా అంజయ్య టీ- ఫైబర్ అనుబంధ స్టెర్లైట్ టెక్నాలజీస్ లిమిటెడ్ లో ప్రైవేట్ డ్రైవర్‌గా తర్వాత టెక్నీషియన్‌గా పనిచేసి ఉద్యోగం మానేశాడని తెలిపారు. అనంతరం బ్యాటరీల దొంగతనం చేయాలని ఆలోచనతో A-2 అయిన మండలి రవి, A-3 అయిన చెమేల్ల నరేష్ లకు చెప్పడంతో ముగ్గురు పథకం ప్రకారం వివిధ గ్రామ పంచాయతీ భవనాల్లో ఏర్పాటు చేసిన టీఫైబర్ సంబంధించిన బ్యాటరీలు యూపీఎస్‌లను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. దొంగిలించిన బ్యాటరీలు యూపీఎస్ పవర్ సప్లయర్స్‌ను మండలి రవి తన ఆటోలో తరలించి వాటిని విక్రయించేందుకు తీసుకెళ్తున్న సమయంలో పట్టుకున్నట్టు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ సుమారు రూ. 4,52,000/- ఉంటుందని అంచనా వేస్తున్నారు. అరెస్ట్ చేసిన నిందితులు బండ అంజయ్య, మండలి రవి, చేమెల్ల నరేష్‌లు ముగ్గురు లక్ష్మీపూర్ నివాసీలుగా గుర్తించినట్టు సీఐ తెలిపారు.

Next Story