- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేవాలయాల్లో వరుస చోరీలు.. దంపతుల అరెస్ట్
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి సర్కిల్ పరిధిలోని పలు గ్రామాల దేవాలయాల్లో వరుస దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు.

దిశ, మెట్ పల్లి: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి సర్కిల్ పరిధిలోని పలు గ్రామాల దేవాలయాల్లో వరుస దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో భార్యాభర్తలైన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మెట్ పల్లి సీఐ సురేష్ బాబు తెలిపారు. సీఐ సురేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ రాములు పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టగా మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన ఆరే శంకర్, ఆరే అనూషలను అదుపులోకి తీసుకుని విచారించగా, ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి, మల్లాపూర్, కథలాపూర్ మండలాల్లోని పలు దేవాలయాల్లో చోరీలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని తెలిపారు. నిందితుల వద్ద నుంచి 20 గ్రాముల బంగారం, 1.250 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయనతో పాటు ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్, మెట్‌పల్లి ఎస్సై కిరణ్ కుమార్‌లు ఉన్నారు.






