- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. పార్లమెంట్‌లో చర్చకు వాయిదా తీర్మానం ఇచ్చిన కేసీ వేణుగోపాల్
గత కొంత కాలంగా కొనసాగుతున్న వివాదానికి తెర దించుతూ సోమవారం భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది.

దిశ, వెబ్ డెస్క్: గత కొంత కాలంగా కొనసాగుతున్న వివాదానికి తెర దించుతూ సోమవారం భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం (Trade agreement between India and the US) కుదిరింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. భారత్ నుంచి వచ్చే వస్తువల దిగుమతులపై సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించినట్లు ప్రకటించారు. దీనిపై స్పందించిన భారత ప్రధాని మోడీ (Indian Prime Minister Modi) ట్రంప్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. కాగా ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం గోప్యంగా ఉంచిందని ఆరోపిస్తూ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కేసీ వేణుగోపాల్ (MP KC Venugopal) లోక్‌సభలో వాయిదా తీర్మానం (Adjournment Resolution) నోటీసు ఇచ్చారు. దేశ ఆర్థిక, వ్యవసాయ, వ్యూహాత్మక రంగాలపై తీవ్ర ప్రభావం చూపే ఈ ఒప్పందంపై పార్లమెంట్‌లో తక్షణమే చర్చ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రభుత్వ గోప్యతపై ప్రశ్నలు
ఈ ఒప్పందానికి సంబంధించి అనేక నిబద్ధతలు వెలుగులోకి వస్తున్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని వేణుగోపాల్ విమర్శించారు. "ప్రభుత్వం పార్లమెంట్‌ను విశ్వాసంలోకి తీసుకోకుండా ఇంతటి కీలక నిర్ణయాలు తీసుకోవడం సరైనది కాదు. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంలోని ఖచ్చితమైన నిబంధనలు మరియు షరతులను తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు ఉంది" అని ఆయన తన నోటీసులో పేర్కొన్నారు.
తక్షణ చర్చకు డిమాండ్
భారత్-అమెరికా మధ్య తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందం అత్యంత ప్రజా ప్రాముఖ్యత కలిగినది. ఇది అత్యవసరమైనది కాబట్టి, లోక్ సభలోని మిగిలిన కార్యకలాపాలను పక్కన పెట్టి తాజా ఒప్పందంపై చర్చించాలని ఆయన కోరారు. ఒప్పందానికి సంబంధించిన అన్ని వివరాలను ప్రభుత్వం పార్లమెంట్ ముందు ఉంచాలని, దేశానికి స్పష్టత ఇవ్వాలని కేసీ వేణుగోపాల్ తన వాయిదా తీర్మానంలో స్పష్టం చేశారు. ఈ వాయిదా తీర్మానం నేపథ్యంలో లోక్‌సభలో ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.






