- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
H-1B వీసా రిజిస్ట్రేషన్ షెడ్యూల్ విడుదల.. ఇక లక్షడాలర్లు చెల్లించాల్సిందే
2027 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి వీసా రిజిస్ట్రేషన్ షెడ్యూల్ ను యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. ఈ షెడ్యూల్ లో H-1B వీసా రిజిస్ట్రేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇకపై అమెరికాలో ఉద్యోగం చేయాలంటే లక్షడాలర్లు చెల్లించాల్సిందే. H-1B వీసాల ప్రక్రియలో అమెరికా భారీ మార్పులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2027 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి వీసా రిజిస్ట్రేషన్ షెడ్యూల్ ను యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. ఈ షెడ్యూల్ లో H-1B వీసా రిజిస్ట్రేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. 2026 మార్చి 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుండగా.. 2026 మార్చి 19 నాటికి ఈ గడువు ముగుస్తుంది. మార్చి 31న ఇమిగ్రేషన్ అధికారులు ఫైనల్ లిస్టును ప్రకటిస్తారు.
రూ.83 లక్షలు చెల్లించాల్సిందే..
కాగా.. ట్రంప్ సర్కార్ 2025 సెప్టెంబర్లో ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం.. హై స్కిల్డ్ పొజిషన్లలో ఉద్యోగాలు చేసేవారు ఏకంగా లక్ష డాలర్లు (ప్రస్తుతం ఉన్న రూపాయి విలువను బట్టి రూ.83 లక్షలు సుమారు)చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా అమెరికా H-1B వీసాకు అప్లై చేసుకునేవారిపై ఇది మోయలేని భారమనే చెప్పాలి. ఉద్యోగులను అమెరికాకు పిలిపించుకునే కంపెనీలపై ఇది మరింత ఆర్థిక భారాన్ని మోపుతుంది. వీసా రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు.. ప్రాథమిక రిజిస్ట్రేషన్ ఫీజును కూడా 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంచారు.
టాలెంట్ ఉన్నవారికి ఇంపార్టెన్స్
ఈసారి వీసాలో రాండమ్ లాటరీకి స్వస్తి చెప్పి వెయిటేజ్ విధానాన్ని తీసుకొచ్చారు. ఎక్కువ జీతం ఉన్నవారికే వీసా వచ్చే అవకాశాలెక్కువ. టాలెంట్ ఉన్నవారికి ప్రాధాన్యమిచ్చేందుకు ఈ పద్ధతిని తీసుకొచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. ఉద్యోగులను హైర్ చేసుకునే సంస్థలు USCIS వెబ్ సైట్లో అకౌంట్ ఓపెన్ చేసి తమ ఉద్యోగుల వివరాలను ఎంటర్ చేయాలి. లాటరీలో ఎంపికైనవారే ఏప్రిల్ 1 నుంచి వీసా పిటిషన్లు వేసేందుకు అర్హులవుతారు.






