- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్యకర్తల కోరిక - ఓటర్ల తీర్పు.. తెలంగాణలో కొత్త రాజకీయ ప్రయాణంపై కవిత కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త రాజకీయ ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ కర్యకర్తలు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి, ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారని, ఇది ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకమని జాతీయ మీడియాతో కవిత చెప్పుకొచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 13 శుక్రవారం జరిగిన ఓట్ల లెక్కింపులో మాజీ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత మద్దతుదారులు పలు ప్రాంతాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, కవిత రాజకీయ ప్రయాణంపై జాతీయ మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "మున్సిపల్ ఎన్నికల విషయానికి వస్తే, భవిష్యత్తులో మేము ఒక రాజకీయ పార్టీగా అవతరించబోతున్నామని అప్పటికే ప్రకటించాము. కానీ అధికారికంగా పార్టీని ప్రకటించకముందే.. చివరి నిమిషంలో మా కార్యకర్తలు కొందరు పోటీ చేయాలని కోరారు. దీంతో తాము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై బరిలోకి దిగాము. అయినప్పటికి తెలంగాణ ప్రజలు మమ్మల్ని మంచి ఫలితాలతో ఆశీర్వదించారు అని చెప్పుకొచ్చారు.
మేము ఒక మున్సిపాలిటీని గెలుచుకోవడంతో పాటు, మరొక మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవిని కూడా దక్కించుకోబోతున్నామని, ఇవే కాకుండా మరో 40 చోట్ల తమ కార్యకర్తలు గెలిచే అవకాశం ఉండేదన్నారు. ఈ ఫలితాల పట్ల తాము చాలా సంతోషంగా ఉన్నామని. తెలంగాణలో అత్యంత పారదర్శకమైన, అహంకారం లేని, అందరినీ కలుపుకుపోయే రాజకీయాలను అందిస్తామని తాము పదేపదే వాగ్దానం చేశామని. ప్రజల మద్దతు ఇలాగే కొనసాగుతుందని, వారు మమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నట్లు ఈ సందర్భంగా జాగృతి అధ్యక్షురాలు కవిత మీడియాతో చెప్పుకొచ్చారు.






