Kavitha: కాంగ్రెస్ పార్టీలోకి కవిత.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన టీపీసీసీ చీఫ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-13 11:31:50  IST  )

తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు ఇటీవల మీడియాలో వినిపిస్తున్నాయి.

Kavitha: కాంగ్రెస్ పార్టీలోకి కవిత.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన టీపీసీసీ చీఫ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు ఇటీవల మీడియాలో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ వదంతులపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో భారీగా అవినీతి జరిగిందని చెబుతున్నారని పేర్కొన్నారు. ఆమె చేస్తున్న ఆరోపణలకు బీఆర్ఎస్ పార్టీ నేతలే సమాధానం చెప్పాలన్నారు. ఆమె వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అవినీతి, అక్రమాలను తెలంగాణ ప్రజలు ఏమాత్రం ఆదరించబోరని అన్నారు. ఇక బీజేపీ నేతలు దేవుళ్లను రాజకీయాల్లోకి లాగుతున్నారని, దేవుళ్ల పేరుతో రాజకీయంతోనే ఓటు బ్యాంకును పెంచుకుంటున్నారని మహేశ్ కుమార్ గౌడ్ కామెంట్ చేశారు.

READ MORE ....

బీఆర్ఎస్‌కు గతం తప్ప భవిష్యత్తు లేదు.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చిట్‌చాట్

Next Story