- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kavitha: నిరుద్యోగుల అరెస్ట్ అప్రజాస్వామికం.. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత ఫైర్
రాష్ట్రంలో వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని అశోక్ నగర్‌లోని సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. మెరుపు ఆందోళనకు దిగారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని అశోక్ నగర్ (Ashok Nagar)లోని సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరుద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. మెరుపు ఆందోళనకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిరుద్యోగులను చదరగొట్టి పలువురు ముఖ్యులను అరెస్ట్ చేసి సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ క్రమంలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టిన నిరుద్యోగులపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపడంపై తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మె్ల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తీవ్రంగా మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆమె.. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నమ్మి వంచిస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి, రెండేళ్లలో 20 వేల ఉద్యోగాలకు మించి ఇవ్వలేదని ఆమె విమర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని, తక్షణమే వారందరినీ విడుదల చేసి, స్పష్టమైన జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని కవిత డిమాండ్ చేశారు.
READ MORE ....
Job calendar: రోడ్డెక్కిన నిరుద్యోగులు.. సెంట్రల్ లైబ్రరీ వద్ద మెరుపు ధర్నా






