హాస్టల్ ఆవరణలో సంచరిస్తున్న పాములు.. కవిత ట్వీట్ వైరల్

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-03 15:11:26  IST  )

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గురుకులంలో ఇంటర్ విద్యార్థిని అశ్మిత పాముకాటుకు గురై మృత్యువుతో పోరాడుతుందన్న ఘటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా(X) వేదికగా స్పందించారు.

హాస్టల్ ఆవరణలో సంచరిస్తున్న పాములు.. కవిత ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి గురుకులంలో ఇంటర్ విద్యార్థిని అశ్మిత పాముకాటుకు గురై మృత్యువుతో పోరాడుతుందన్న ఘటనపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా(X) వేదికగా స్పందించారు. విద్యార్థిని పాము కాటుకు గురైన వార్త తనను ఎంతో కలిచివేస్తోందన్నారు. రేవంత్‌ రెడ్డి గారు మీ పాలనలో గురుకులాలు విద్యా నిలయాలా..? లేదంటే విషసర్పాలకు ఆవాసాలా..? అని కవిత ప్రశ్నించారు.

విషజ్వరాలు ప్రబలుతున్నాయి

‘కాంగ్రెస్ అసమర్థ పాలనలో విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది. విద్యార్థిని అశ్మిత పాము కాటుకు గురవడం కలచివేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ విద్యాలయాల్లో నిత్యం కలుషిత ఆహారం, విద్యార్థుల ఆత్మహత్యలు, పాము కాట్లు వంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వానికి మాత్రం కనువిప్పు కలగడం లేదు. గురుకుల విద్యా సంస్థల్లో అపరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ లేకపోవడం, అరకొర వసతులతో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల ఆవరణలో సంచరిస్తున్న పాములు విద్యార్థులను కాటు వేస్తున్నాయి. విద్యాశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇకనైనా మొద్దు నిద్ర వీడి అస్తవ్యస్తంగా మారిన గురుకులాలను, సంక్షేమ హాస్టళ్లను గాడినపెట్టండి. పాము కాటుకు గురైన అస్మితకు మెరుగైన వైద్యం అందించాలి’ అని కవిత డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని గురుకుల విద్యార్థులకు కడుపునిండా తిండి లేదు.. ప్రాణాలకు రక్షణ లేదన్నారు. సీఎం హార్వర్డ్‌ యూనివర్సిటీకి వెళ్లి విదేశాల్లో ఫొటోలకు పోజులిస్తే ఇక్కడ పేద విద్యార్థులు ఆస్పత్రి పాలై కొట్టుమిట్టాడుతున్నారని అంతకముందు బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నారా..? లేక చావుతో పోరాడేందుకు వెళ్తున్నారా..? అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి పతనమవుతున్న గురుకులాలను కాపాడాలి. రాజకీయ కక్షసాధింపుల మీదున్న శ్రద్ధలో కొంతైనా పేద పిల్లల బతుకుపై పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. డని విజ్ఞప్తి చేశారు.

Read Also.. తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీపై BIG అప్డేట్

Next Story