- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ వాసులకు అలర్ట్.. మరో గంటలో 8 జిల్లాలకు భారీ వర్షసూచన
తెలంగాణ వ్యాప్తంగా రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. చల్లని గాలులతో ప్రజలు సేద తీరుతున్నారు. కొన్నిప్రాంతాల్లో పగలంతా ఎండ ఉక్కపెట్టినా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడుతోంది. కాగా.. మరో గంటలో రాష్ట్రంలోని 8 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ అంచనా వేశారు. ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో మరో గంటలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా.. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే చిరుజల్లులు, మోస్తరు వర్షం కురుస్తోంది. శేరిలింగంపల్లి, మియాపూర్, కూకట్ పల్లి, బాలానగర్, అమీర్ పేట్, మాధాపూర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, నాంపల్లి ప్రాంతాల్లో సాయంత్రం వేళ వర్షం కురిసింది. సరూర్ నగర్, ఎల్బీ నగర్, ముషీరాబాద్, ఓయూ, హిమాయత్ నగర్, ఉప్పల్, నాగోల్, మల్కాజ్ గిరి ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది.






