జడ్చర్ల 16, 20 వార్డులలో కమిషనర్ ఆకస్మిక తనిఖీ..

by Kodari Anjali |

వర్షాకాలం నేపథ్యంలో జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించారు.

జడ్చర్ల 16, 20 వార్డులలో కమిషనర్ ఆకస్మిక తనిఖీ..
X

దిశ, జడ్చర్ల: వర్షాకాలం నేపథ్యంలో జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. మున్సిపల్ కమిషనర్ గిరీష్ సోమవారం జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ ఎం. గిరీష్ మున్సిపాలిటీ పరిధిలోని 16, 20 వార్డులలో శానిటేషన్ మరియు డ్రైనేజీ పనులను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డుల్లోని పరిశుభ్రత, మురుగు కాలువల పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్, సంబంధిత సిబ్బందికి తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రతిరోజు అన్ని వార్డుల్లో పరిశుభ్రతగా ఉండేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండి పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఇంటి చుట్టూ నీటి నిల్వలు ఉండకుండా చూసుకోవాలని, దోమల బారి నుంచి రక్షణ పొందాలని ప్రజలకు తెలియజేశారు. వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని కమిషనర్ కోరారు.ఈ తనిఖీల్లో మున్సిపల్ సిబ్బంది, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Next Story