చనిపోతానన్న వ్యక్తిని 10 నిమిషాల్లో కాపాడిన పోలీసులు

by Ratna Kumari |

కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో చెప్పి వెళ్లిపోయిన ఓ వ్యక్తిని కామారెడ్డి పోలీసులు కేవలం 10 నిమిషాల్లో గుర్తించి ప్రాణాపాయం నుంచి రక్షించారు.

చనిపోతానన్న వ్యక్తిని 10 నిమిషాల్లో కాపాడిన పోలీసులు
X

దిశ, కామారెడ్డి రూరల్ : కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకుంటానని ఇంట్లో చెప్పి వెళ్లిపోయిన ఓ వ్యక్తిని కామారెడ్డి పోలీసులు కేవలం 10 నిమిషాల్లో గుర్తించి ప్రాణాపాయం నుంచి రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుటుంబ సభ్యులతో మనస్పర్థల నేపథ్యంలో తీవ్ర ఆవేదనకు గురైన వ్యక్తి ఇంట్లో చనిపోతానని చెప్పి బయటకు వెళ్లిపోయాడు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే డయల్-100కు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న కానిస్టేబుల్ అరుణ్ నేతృత్వంలోని పోలీసు బృందం వెంటనే గాలింపు చేపట్టి, కేవలం 10 నిమిషాల్లోనే రైల్వే ట్రాక్ వద్ద అతడిని గుర్తించి సురక్షితంగా అదుపులోకి తీసుకుంది. అనంతరం అతడికి ధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు అప్పగించి ఇంటికి చేర్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. "సమస్యలకు ఆత్మహత్య ఎప్పుడూ పరిష్కారం కాదు. ఆపదలో ఉన్నప్పుడు వెంటనే డయల్-100కు సమాచారం ఇవ్వాలి. ప్రతి ప్రాణం అమూల్యమైనది" అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story