- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీపై BIG అప్డేట్
తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీంకోర్టు మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఎమ్మెల్సీల ఎంపికకు తమ మధ్యంతర ఉత్తర్వులు అడ్డంకి కావని స్పష్టం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల (Governor Quota MLCs) ఎంపిక విషయంలో సుప్రీంకోర్టు (Supreme Court) మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఎమ్మెల్సీల ఎంపికకు తమ ఉత్తర్వులు అడ్డంకిగా లేవని తేల్చి చెప్పింది. గతేడాది ఆగస్టు 13 నాటి మధ్యంతర ఉత్తర్వుల్లోనే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పామని, కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. తమ ఎన్నికపై జారీ చేసిన ఉత్తర్వులు ఎత్తివేయాలని మాజీ ఎమ్మెల్సీ అమిర్ అలీ ఖాన్ సుప్రీంకోర్టులో వెకేట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‍పై ఇవాళ విక్రంనాథ్ ధర్మాసనం విచారణ జరిపింది. అమిర్ అలీ పిటిషన్ ను దాసోజు శ్రవణ్ వేసిన ప్రధాన పిటిషన్ తో జత చేస్తూ ఆదేశాలు ఇస్తూ తదుపరి విచారణ మార్చి 19కి వాయిదా వేసింది.
అసలేం జరిగిందంటే?:
2023లో కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను నిర్ణయించి, నాటి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు సిఫారసు చేశారు. అయితే రాజకీయ పార్టీతో అనుబంధం ఉందని, రాజ్యంగ ఆర్టికల్ 171 (5) పేర్కొన్న రంగాల్లో ప్రతిభ లేదని పేర్కొంటూ ఇద్దరి నామినేషన్లను గవర్నర్ తిరస్కరించారు. అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 2024లో ఈ రెండు స్థానాలకు ప్రొఫెసర్ కోదండరామ్, జర్నలిస్టు అమీర్ అలీఖాన్ పేర్లను గవర్నర్ కోటాలో ప్రభుత్వం సిఫార్సు చేయగా గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ నియామకాన్ని సవాలు చేస్తు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ తొలుత హైకోర్టుకు ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై 2025 ఆగస్టు 13 విచారణ జరిపిన సుప్రీంకోర్టు కోదండరామ్, అలీఖాన్ నియామకాలను రద్దు చేసింది. తదుపరి ఉత్తర్వులకు లోబడే ఈ రెండు స్థానాలను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. అయితే తమ ఎన్నికపై జారీ చేసిన ఉత్తర్వులను ఎత్తివేయాలని అమిరి అలీ ఖాన్ కోరగా తెలంగాణలో ఎమ్మెల్సీల ఎంపికకు అడ్డంకిగా తమ ఉత్తర్వులు లేవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఖాళీ అయిన ఈ రెండు స్థానాలలో ఒకటి తిరిగి ప్రొఫెసర్ కోదండరామ్ పేరు, మరొక స్థానానికి మంత్రి అజారుద్దీన్ పేరును కేబినెట్ ఆమోదించింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో ఏం జరగబోతోంది అనిది వేచి చూడాలి.






