సౌమ్య కుటుంబాన్ని ఆదుకోవాలి: కవిత

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-01 02:54:01  IST  )

కానిస్టేబుల్ సౌమ్య మృతిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సౌమ్య కుటుంబాన్ని ఆదుకోవాలి: కవిత
X

దిశ, వెబ్‌డెస్క్: కానిస్టేబుల్ సౌమ్య మృతిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ‘నిజామాబాద్‌లో గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందడం కలచివేసింది. సౌమ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సౌమ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి’ అని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

శతవిధాలా ప్రయత్నించిన వైద్యులు

శనివారం రాత్రి 9:41 గంటలకు సౌమ్య మృతి చెందినట్లు నిమ్స్ అధికారులు అధికారికంగా ప్రకటించారు. చిన్న వయసులోనే సౌమ్య మరణించడం పట్ల నిమ్స్ యాజమాన్యం సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తాము శతవిధాలా ప్రయత్నించినప్పటికీ ఆమెను దక్కించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ, మృతురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. డ్యూటీలో ఉన్నప్పుడే ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోవడంతో ఎక్సైజ్ శాఖలోనూ విషాదం అలుముకున్నది.

Read More..

ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చికిత్స పొందుతూ మృతి !

Next Story