- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య చికిత్స పొందుతూ మృతి !
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య నిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య నిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇటీవల గంజాయి స్మగ్లర్ల దాడి జరిగిన సందర్భంగా తీవ్రంగా గాయపడి ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన నుంచి ఆసుపత్రిలో ఉన్న సౌమ్య ఆరోగ్య పరిస్థితి, అత్యంత విషమంగా తయారయిందట. ఈ నేపథ్యంలోనే కాసేపటి క్రితమే నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సౌమ్య మరణించినట్లు కథనాలు వస్తున్నాయి. ఈ మేరకు నిమ్స్ ఆస్పత్రి నుంచి హెల్త్ అప్డేట్ పేరుతో ఓ ప్రకటన బయటకు వచ్చిందని సమాచారం. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
అసలు ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు ఏం జరిగిందంటే ?
నిజామాబాద్ జిల్లాలో గంజాయిస్ స్మగ్లర్ల కారు దాడిలో ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ సౌమ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. గంజాయి తరలిస్తున్న ముఠాను అడ్డుకునేందుకు సౌమ్య ప్రయత్నించింది. దీంతో ఆమెను కారుతో ఢీకొట్టారు గంజాయి స్మగ్లర్లు. ఈ సంఘటన నేపథ్యంలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ సౌమ్యను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ పెను ప్రమాదం నేపథ్యంలో ఆరోగ్యం విషమించడంతో ఆమె ఇవాళ మరణించినట్లు చెబుతున్నారు.






