- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
18 గంటలుగా కొనసాగుతున్న మంటలు.. రంగంలోకి JNTU నిపుణులు
నిత్యం రద్దీగా ఉండే నాంపల్లిలో నాలుగు అంతస్థుల భవనంలోని ఫర్నీచర్ షాప్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అండర్ గ్రౌండ్ లో చెలరేగిన ఈ మంటలు బిల్లింగ్ మొత్తం వ్యాపించాయి.

దిశ, వెబ్ డెస్క్: నిత్యం రద్దీగా ఉండే నాంపల్లిలో నాలుగు అంతస్థుల భవనంలోని ఫర్నీచర్ షాప్‌లో భారీ అగ్ని ప్రమాదం (major fire hazard) చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అండర్ గ్రౌండ్ లో చెలరేగిన ఈ మంటలు బిల్లింగ్ మొత్తం వ్యాపించాయి. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ఫైర్, హైడ్రా, పోలీస్ ఇతర అన్ని విభాగాల అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కాగా ఈ మంటల్లో ఆరుగురు చిక్కుకున్నట్లు అధికారులు ముందుగా గుర్తించినప్పటికీ మరో 60 ఏండ్ల మహిళ కూడా భవనంలోనే ఉండిపోయిందని, ఆమెతో కలిపి మొత్తం ఏడుగురు ఉన్నట్లు తెలుస్తోంది. భవనంలో పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ వస్తుండడంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలుగుతోంది. గత 18 గంటలుగా ఈ మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాణాలకు తెగించి రెస్క్యూ సిబ్బంది లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ప్పటికీ, దట్టమైన పొగ మరియు భవనం కూలిపోయే ప్రమాదం ఉండటంతో ఆపరేషన్‌కు ఆటంకాలు ఎదురవుతున్నాయి.
రంగంలోకి JNTU నిపుణులు
నాంపల్లి అగ్ని ప్రమాదంలో మంటల ధాటికి భవనం పూర్తిగా బలహీనపడటంతో అది ఏ క్షణమైనా కూలిపోయే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో భవనం యొక్క దృఢత్వాన్ని పరీక్షించేందుకు జేఎన్టీయూ (JNTU) ఇంజినీరింగ్ నిపుణుల బృందం కాసేపట్లో నాంపల్లికి చేరుకోనుంది. ఈ నిపుణుల బృందం భవనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి, రెస్క్యూ ఆపరేషన్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై అధికారులకు నివేదిక ఇవ్వనుంది. బాధితుల కుటుంబ సభ్యులు భవనం వెలుపల ఆందోళనతో ఎదురు చూస్తుండటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే తాజా పరిస్థితిని బంటి మంటల్లో చిక్కుకున్న ఏడుగురు ప్రాణాలతో ఉండే అవకాశం లేదని తెలుస్తుంది. మరికొద్ది గంటల్లో వారి బ్రతికే ఉన్నారా లేరా అనే విషయంపై క్లారిటీ రానుంది.






