- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ ఇంకా బతికే ఉన్నాడా? సినీ ప్రియులకు నిద్రపట్టకుండా చేస్తున్న 'సీతారామం 2' అప్డేట్!
టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీస్‌లో ‘సీతారామం’(Sita Ramam) టాప్‌లో ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.

దిశ, సినిమా: టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో వచ్చిన క్లాసిక్ లవ్ స్టోరీస్‌లో ‘సీతారామం’(Sita Ramam) టాప్‌లో ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)తన నటనతో ‘రామ్’గా ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేస్తే, మృణాల్ ఠాకూర్ ‘సీత’గా ఒక దేవతలా మెరిసిపోయింది. వీరిద్దరి మధ్య సాగే ఆ క్యూట్ లవ్ స్టోరీకి హను రాఘవపూడి మేకింగ్, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ తోడవ్వడంతో ఆ సినిమా ఒక ఎమోషనల్ జర్నీలా సాగింది. అయితే, ఇప్పుడు ఈ కాంబో గురించి వస్తున్న ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ ‘సీతారామం’కు సీక్వెల్ రాబోతున్నట్లు సోషల్ మీడియాలో పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ మళ్ళీ జతకట్టబోతున్నారు. అయితే ఇది మొదటి భాగానికి కొనసాగింపుగా ఉంటుందా లేక అదే బ్యాక్‌డ్రాప్‌లో సాగే సరికొత్త ప్రేమకథా? అనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మొదటి పార్ట్‌లో రామ్ మరణంతో కథ ముగియడంతో, పార్ట్ 2లో కథను ఎలా మలుపు తిప్పుతారో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. సీక్వెల్‌లో రామ్ ఇంకా బతికే ఉంటాడా? లేక చనిపోయినట్లుగా చూపిస్తారనేది? ప్రేక్షకులకు నిద్రపట్టకుండా చేస్తోంది. బహుశా ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ లేదా రామ్-సీతల మధ్య ఉన్న మరిన్ని మధుర జ్ఞాపకాలతో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉందని టాక్. దర్శకుడు హను రాఘవపూడి ప్రస్తుతం ప్రభాస్‌తో ఒక భారీ ప్రాజెక్ట్ (ఫౌజీ) చేస్తున్న విషయం తెలిసిందే. అది పూర్తయిన వెంటనే ‘సీతారామం 2’ పై ఫోకస్ పెట్టే అవకాశం ఉందట. ఈ వార్త తెలియగానే ఫ్యాన్స్ ఆనందంతో ఎగిరి గంతేస్తున్నారు. ‘మరోసారి థియేటర్లలో ప్రేమ వర్షం కురవబోతోంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. వైజయంతీ మూవీస్ వంటి భారీ నిర్మాణ సంస్థ ఈ సీక్వెల్‌ను ప్లాన్ చేస్తే మాత్రం, బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాయడం ఖాయం. రామ్ రాసిన లేఖకు, సీత ఇచ్చిన సమాధానం ఏమిటో మళ్ళీ వెండితెరపై చూడాలని ప్రతి ఒక్కరూ ఆశగా ఎదురుచూస్తున్నారు!






