Ranbir Kapoor: మూడు పార్టులుగా యానిమల్ సినిమా..హీరో, విల‌న్ ఒక్క‌రేనా !

by velandi.Saikiran |   (  Updated:2026-01-27 17:10:00  IST  )

యానిమల్ పార్క్ పట్టాలెక్కనుందని హీరో రణబీర్ కపూర్ వెల్లడించారు. 2027లో షూటింగ్ ప్రారంభిస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు.

Ranbir Kapoor: మూడు పార్టులుగా యానిమల్ సినిమా..హీరో, విల‌న్ ఒక్క‌రేనా !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. యానిమల్ మొదటి భాగం గ్రాండ్ సక్సెస్ కావడంతో యానిమల్ పార్క్ పేరుతో రెండో పార్ట్ రాబోతోంది. అయితే ఈ సినిమా సీక్వెల్ పై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. ఈ నేపథ్యంలోనే యానిమల్ పార్క్ పై హీరో రణబీర్ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ సినిమా కారణంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చాలా బిజీగా ఉన్నారని వెల్లడించారు.

ఆ సినిమా పూర్తికాగానే యానిమల్ పార్క్ పట్టాలెక్కనుందని హీరో రణబీర్ కపూర్ వెల్లడించారు. 2027లో షూటింగ్ ప్రారంభిస్తామని కూడా క్లారిటీ ఇచ్చారు. యానిమ‌ల్ సీక్వెల్ లో డ్యూయల్ రోల్ ఉంటుందని వెల్లడించారు. అంతేకాదు, ఈ సినిమాలో హీరోగా, విలన్ గా తానే ఉండబోతున్నట్లు కూడా హింట్ ఇచ్చారు. యానిమల్ సినిమాను రెండు కాదు, మూడు పార్టులు చేసేందుకు సందీప్ ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు గుర్తు చేశారు రణబీర్ కపూర్.

Next Story