ముగింపు దశకు ప్రచారం.. ఆ మండలంలో పాత వైరం?

by Jakkula.Mamatha |   (  Updated:2026-02-08 10:52:40  IST  )

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. పోలింగ్‌కు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో, ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.

ముగింపు దశకు ప్రచారం.. ఆ మండలంలో పాత వైరం?
X

దిశ, నిర్మల్ ప్రతినిధి: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. పోలింగ్‌కు మరో మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో, ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్, బీజేపీల మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ నెలకొనగా, నిర్మల్, ఆదిలాబాద్ వంటి కీలక పట్టణాల్లో పట్టు నిలుపుకోవాలని అగ్ర నాయకత్వం పావులు కదుపుతోంది. తూర్పు ప్రాంతంలోని బెల్లంపల్లి, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తన ప్రాబల్యాన్ని చాటుకుంటూ గట్టి పోటీనిస్తోంది. మరోవైపు, బైంసాలో ఎంఐఎం - బీజేపీ మధ్య నేరుగా పోరు సాగుతుండగా, ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు, ఎక్స్-అఫిషియో ఓట్లు అత్యంత కీలకంగా మారనున్నాయి. గెలుపు కోసం పార్టీలు చేస్తున్న విన్యాసాలు, తెరవెనుక సాగుతున్న రాజకీయ సమీకరణాలతో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది.

పురపాలక సంఘాల ఎన్నికలకు మరో మూడు రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండగా... ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. జిల్లాలో రెండు మున్సిపాలిటీలలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రభావం బలంగా కనిపిస్తుండగా.. బైంసా మున్సిపాలిటీలో ఎంఐఎం ఏకపక్ష ప్రభావం స్పష్టంగా ఉంది. ఈ మున్సిపాలిటీలో బీజేపీతో ఆ పార్టీ తీవ్రంగా పోటీపడుతున్న పరిస్థితులు ఉన్నాయి.

నాలుగు చోట్ల కమలం వర్సెస్ కాంగ్రెస్

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన నాలుగు పురపాలక సంఘాల్లో కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ నడుము తీవ్ర పోటీ నెలకొంది. ఆదిలాబాద్, నిర్మల్, కాగజ్ నగర్, బైంసా మున్సిపాలిటీలలో బీజేపీ ప్రభావం తీవ్రంగా ఉంది. మూడు పురపాలక సంఘాల్లో కాంగ్రెస్ బిజెపి నడుమ పోటీ ఉండగా బైంసాలో మాత్రం బీజేపీ ఎంఐఎం నడుమ పోటీ నెలకొంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నిర్మల్ లో కాంగ్రెస్, ఎంఐఎం పరోక్షంగా జతకట్టి బిజెపిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి కాగా బైంసాలో మాత్రం బిజెపి ఎంఐఎం లు ప్రత్యక్ష పోరుకు దిగుతున్నాయి. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ బిజెపి నడుమ ఉండగా భారత్ రాష్ట్ర సమితి కూడా ప్రభావం చూపుతున్నది. కాగజ్ నగర్ లో బిజెపి, భారత్ రాష్ట్ర సమితి నడుమ పోటీ కనిపిస్తున్నది.

తూర్పు జిల్లాలో గులాబీ ప్రభావం..

కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి తూర్పు జిల్లాలో గులాబీ ప్రభావం బలంగా పెరిగింది. ఆసిఫాబాద్ చెన్నూరు కాగజ్ నగర్ క్యాతన్ పల్లి బెల్లంపల్లి పురపాలక సంఘాల్లో భారత్ రాష్ట్ర సమితి పార్టీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే పశ్చిమ జిల్లాకు సంబంధించిన ఆదిలాబాద్ ఖానాపూర్ పురపాలక సంఘాల్లో గులాబీ ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే ఈ మున్సిపాలిటీలలో ఎక్కడా కూడా భారత్ రాష్ట్ర సమితి సింగల్ గా మున్సిపల్ కౌన్సిల్‌లను గెలుచుకునే పరిస్థితులు కనిపించడం లేదు. కొన్నిచోట్ల పరోక్షంగా బిజెపి, సిపిఐ ఇండిపెండెంట్‌లపై ఆధారపడే పరిస్థితి ఉంది.

బైంసాలో ఎంఐఎం, బీజేపీ..

ఇక నిర్మల్ బైంసా పురపాలక సంఘంలో ఎంఐఎం బీజేపీ నడుమ తీవ్ర పోటీ ఉంది. మళ్లీ ఈ పురపాలక సంఘం పై ఎంఐఎం ఆశలు పెంచుకుంది. బిజెపి 26 స్థానాలకు గాను 12 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నది. ఎంఐఎం 18 స్థానాల్లో పోటీలో ఉంది. స్వస్థత వస్తే ఎంఐఎం ఏకపక్షంగా చైర్మన్ స్థానం గెలుచుకునే అవకాశం ఉంది కానీ బీజేపీ ఇండిపెండెంట్లు, ఎక్స్ అఫీషియో సభ్యులపై ఆధారపడే పరిస్థితులు ఉన్నాయి.

కమల వికాసం కోసం గులాబీపార్టీ పాట్లు.. పురపోరులో కొత్త సమీకరణాలు

Next Story