- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కమల వికాసం కోసం గులాబీపార్టీ పాట్లు.. పురపోరులో కొత్త సమీకరణాలు
మున్సిపల్ ఎన్నికల సమయాన క్షేత్రస్థాయిలో భిన్నమైన రాజకీయ సమీకరణలు జరుగుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల సమయాన క్షేత్రస్థాయిలో భిన్నమైన రాజకీయ సమీకరణాలు జరుగుతున్నాయి. పైకి కాంగ్రెస్, బీజేపీపై విమర్శలు చేస్తున్న గులాబీ నేతలు అంతర్గతంగా మాత్రం కమలం పార్టీకి సపోర్టు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే, ఈ పరిస్థితి అన్ని చోట్ల కనపడటంలేదు. ఎక్కడైతే తమ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం లేదో అక్కడ కమలం పార్టీ అభ్యర్థి విజయం కోసం కష్టపడుతున్నట్లు తెలుస్తున్నది. అలాగే బీజేపీ బలహీనంగా ఉన్న చోట్ల ఆ పార్టీ నేతలు కారు పార్టీ విజయం కోసం పనిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది.
ఇరువురి టార్గెట్ కాంగ్రెస్
ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఆ పార్టీ లీడర్లు పనిచేయడం సహజం. ఒకవేళ పార్టీ అభ్యర్థి బలహీనంగా ఉంటే మరింత కష్టపడి పనిచేస్తుంటారు. కానీ, మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ నేతలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. గెలుపు అవకాశాలు లేని అభ్యర్థుల తరఫున పనిచేయకుండా బీజేపీ అభ్యర్థి విజయం కోసం ఇంటర్నల్‌గా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకోసం కొందరు గుట్టుచప్పుడు కాకుండా పనిచేస్తుంటే, కొందరైతే ఇంటింటికీ వెళ్లి కమలం అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతున్నట్లు చర్చ జరుగుతున్నది. ఇందులో బీఆర్ఎస్ కంటే బీజేపీ ముందంజలో ఉన్నట్లు పట్టణాలు/వార్డుల్లో కనిపిస్తున్నది. అలాగే, బీజేపీ గెలిచే అవకావం లేని చోట ఆ పార్టీ నేతలు కారు పార్టీకి సపోర్టు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఇరువురి టార్గెట్ కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి కావడంతో పరస్పరం సహకరించుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
సహకారానికి సూత్రదారులు ఎవరు?
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య నెలకొన్న అవగాహన వెనుక ఎవరు ఉన్నారనే అంశం ఆసక్తికరంగా మారింది. పార్టీ నాయకత్వమే తమ కేడర్‌కు అలాంటి సంకేతాలు ఇచ్చిందా? లేక క్షేత్రస్థాయిలోని పరిస్థితుల మేరకు కేడర్ ఆ విధంగా వ్యవహరిస్తున్నదా? అనే చర్చ జరుగుతున్నది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తామే ప్రత్యామ్నయం అంటూ ధీమాగా ఉన్న బీఆర్ఎస్ నేతలు మున్సిపల్ ఎన్నికల్లో సొంత అభ్యర్థుల విజయం కోసం పాటుపడకుండా బీజేపీ కోసం పనిచేయాలని కేడర్‌ను ఆదేశిస్తారా? అలాగే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రహస్య స్నేహం ఉందని, అందుకే ఫోన్ ట్యాఫింగ్ కేసులో కారు పార్టీ నేతలను అరెస్ట్ చేయడం లేదంటూ ఆరోపిస్తోన్న బీజేపీ నేతలు బీఆర్ఎస్ విజయం కోసం పనిచేయాలని పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇస్తారా? అనే చర్చ జరుగుతున్నది.






