- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వధువు కావలెను.. ఆ గ్రామంలో వినూత్న ఫ్లెక్సీ వైరల్!
ఓ గ్రామంలో వెలిసిన ఫ్లెక్సీ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

దిశ,వెబ్‌డెస్క్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక వింతలు, విశేషాలకు కొదువ లేకుండా పోయింది. ప్రపంచంలో ఎక్కడ ఏ చిన్న ఘటన జరిగిన క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని ఓ గ్రామంలో వెలిసిన ఫ్లెక్సీ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. పెళ్లి సంబంధాల కోసం ఈ కాలం యువకులు వినూత్న దారి ఎంచుకున్నారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరిపల్లెలో పశువుల పండుగ సందర్భంగా యువకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్(Viral) అవుతోంది. కొందరు యువకుల ఫొటోలపై స్టార్(*) గుర్తులు వేసి ఆ ఫ్లెక్సీలో ముఖ్య గమనిక అంటూ.. ‘‘స్టార్ గుర్తు కలిగిన యువకులకు వధువు కావాలి’’ అని ముద్రించారు. దీన్ని చూసిన వారు ఆశ్చర్యానికి గురయ్యారు. అందరూ ఈ వెరైటీ ప్రచారాన్ని చూసి ఐడియా అదిరిపోయిందంటూ చర్చించుకుంటున్నారు. ఏదైమైనా ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో వైరల్‌గా మారింది.
Read More..






