- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరల్డ్ రికార్డ్ సృష్టించిన భారత షూటర్ ఇషా సింగ్
భారత యువ షూటర్ ఇషా సింగ్ అంతర్జాతీయ క్రీడా వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించింది.

దిశ, వెబ్ డెస్క్ : భారత యువ షూటర్ ఇషా సింగ్ అంతర్జాతీయ క్రీడా వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించింది. జర్మనీలోని మునిచ్ లో జరుగుతున్న ISSF వరల్డ్ కప్ మహిళల 25 మీటర్ల పిస్టల్ (Women’s 25m Pistol) ఈవెంట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఆమె, ఏకంగా 43 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలవడమే కాకుండా ప్రతిష్టాత్మక బంగారు పతకాన్ని (Gold Medal) కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇషా సింగ్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఈ విభాగంలో ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. గతంలో దక్షిణ కొరియా షూటర్ కిమ్-యేజీ(42m) పేరిట ఉన్న రికార్డును ఇషా బద్దలు కొట్టింది.
కాగా ఇందులో 50 పాయింట్ల వరకు సాధించే అవకాశం ఉంది. ప్రపంచ రికార్డుతో కూడిన ఈ చారిత్రాత్మక విజయం పట్ల నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI), క్రీడా ప్రముఖులు, దేశవ్యాప్తంగా ఉన్న క్రీడా ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇషా సింగ్ సాధించిన ఈ అద్భుత మైలురాయిపై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది.






