- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిచ్చర పిడుగు వైభవ్‌పై దిగ్గజాల ప్రశంసలు
వైభవ్ పరుగుల సునామీపై క్రీడా ప్రముఖులతో పాటు, సినీ, రాజకీయ నాయకులూ ప్రశంసల వర్షం కురిపించారు.

దిశ, వెబ్ డెస్క్ : IPL 2026 సీజన్లో బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో రాజస్థాన్ జట్టు హైదరాబాద్ పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 243 పరుగుల భారీ స్కోర్ సాధించింది అంటే ఆ జట్టులోని యంగ్ విధ్వసం వైభవ్ సూర్యవంశీనే కారణం. కేవలం 29 బాల్స్ లో 97 పరుగులు బాదాడు అంటే వైభవ్ పరుగుల సునామీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ 97 పరుగుల్లో సిక్సులు, ఫోర్ల ద్వారానే 92 రన్స్ చేసాడు. ఏకంగా 12 సిక్సులు, 5 ఫోర్లు బాది సన్ రైజర్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. అయితే సెంచరీ మిస్ అవడంతో ఈ యంగ్ బ్యాటర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. దీనంగా పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్లడం ప్రేక్షకుల గుండెల్ని పిండేసింది. బ్యాటుతో తలబాదుకుంటూ వెళ్తుండగా హైదరాబాద్ ప్లేయర్స్ వచ్చి భుజం తట్టడం మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది.
అయితే వైభవ్ సునామీపై క్రీడా ప్రముఖులతో పాటు, సినీ, రాజకీయ నాయకులూ ప్రశంసల వర్షం కురిపించారు. 'బాస్ బేబీ' అంటూ యువరాజ్ ట్వీట్ చేయగా, 'మై గుడ్నెస్.. అతనో అద్భుతం' అంటూ కెవిన్ పీటర్స్ కొనియాడాడు. 'వైభవ్ బ్యాట్ స్వింగ్ అద్భుతం' అని సచిన్ ట్వీట్ చేసాడు. అంతేకాదు కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం 'ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్' అనగా.. 'వైభవ్ సృష్టించిన హారర్ నుంచి తేరుకోడానికి 5 నిముషాలు పట్టింది' అని నటుడు రాహుల్ రవీంద్రన్ ప్రశంసించాడు. ఇక IPL లోని అన్ని జట్ల అభిమానులు వైభవ్ నేటి ఆటకు ఫిదా అయిపోయారు.






