భారత్ వేదికగా ప్రపంచ ఎన్నికల మేధోమథనం.. జనవరి 21 నుంచి అంతర్జాతీయ సదస్సు

by Malleboina Mahesh |   (  Updated:2026-01-19 07:46:26  IST  )

ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల నిర్వహణలో అత్యాధునిక విధానాలపై చర్చించేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) సిద్ధమైంది.

భారత్ వేదికగా ప్రపంచ ఎన్నికల మేధోమథనం.. జనవరి 21 నుంచి అంతర్జాతీయ సదస్సు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజాస్వామ్య పరిరక్షణ, ఎన్నికల నిర్వహణలో అత్యాధునిక విధానాలపై చర్చించేందుకు భారత ఎన్నికల సంఘం (ECI) సిద్ధమైంది. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జనవరి 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు 'ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్‌మెంట్' (IICDEM) 2026ను నిర్వహించనుంది. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో ప్రపంచవ్యాప్తంగా 70 కి పైగా దేశాల నుండి సుమారు 100 మంది ప్రతినిధులు పాల్గొని, ఎన్నికల నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు, ఉత్తమ పద్ధతులపై చర్చించనున్నారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ఈ సదస్సులో భాగంగా ఎన్నికల సంఘం 'ECINET' అనే వినూత్న డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను అధికారికంగా ప్రారంభించనుంది. ఇది ఎన్నికలకు సంబంధించిన అన్ని సేవలను ఒకేచోట అందించే వన్-స్టాప్ డిజిటల్ వేదికగా పనిచేస్తుంది. వీటితో పాటు, ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలైన 2024 లోక్‌సభ ఎన్నికల వెనుక ఉన్న కృషిని వివరిస్తూ రూపొందించిన "ఇండియా డిసైడ్స్" (India Decides) అనే డాక్యుమెంటరీ సిరీస్‌ను ఈ వేదికపై ప్రదర్శించనున్నారు. ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల మేధావులు కూడా పాల్గొనే ఈ సదస్సులో 40 కి పైగా ద్వైపాక్షిక సమావేశాలు జరగనుండటం విశేషం.

Read More..

సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్‌.. అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించేలా భారీ వ్యూహం

Next Story