యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

by velandi.Saikiran |   (  Updated:2026-06-12 23:00:53  IST  )

జీహెచ్ఎంసీ అమీర్‌పేట్ సర్కిల్-39 పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొ నసాగుతున్నాయని స్థానికులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు.

యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
X

దిశ, ఖైరతాబాద్: జీహెచ్ఎంసీ అమీర్‌పేట్ సర్కిల్-39 పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా కొ నసాగుతున్నాయని స్థానికులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపంతో కింది స్థాయి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలను పట్టించుకోకుండా నిర్మాణదారులు అనుమతులకు మించి నిర్మిస్తున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరు భవన నిర్మాణానికి ఒక రకమైన అనుమతులు తీసుకొని వేరే నిర్మాణాలు చేపడుతుండగా, మరికొందరు నివాస గృహాలకు అ నుమతులు పొంది వాణిజ్య భవనాలుగా నిర్మిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.

కొందరు అధికారులు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి కొ డుతూ తమ జేబు లు నింపుకుంటున్నారనే ఆరోపణ లు వ్యక్తం అవుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై ఫిర్యా దులు వచ్చినా కేవలం నోటీసులు ఇచ్చి, ఒత్తిడి పెరిగితే తాత్కాలికం గా సీజ్ చేసి తర్వాత సెటిల్‌మెంట్ల కు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. రెండు రోజులకే మళ్లీ నిర్మా ణ పనులు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.

రవీంద్ర నగర్‌లో అక్రమ నిర్మాణం

సర్కిల్ పరిధిలోని సనత్‌నగర్ రవీంద్రనగర్ ప్రాంతంలో ఈఎస్ఐ మెడి కల్ గోదాం వెనుక రోడ్డులో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులకు మించి నిర్మాణం జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటు వంటి అక్రమ నిర్మాణాలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

సనత్‌నగర్ గ్రౌండ్ సమీపంలో

సనత్‌నగర్ అల్విన్ కాలనీలోని జీ హెచ్ఎంసీ గ్రౌండ్ సమీపంలో మరో అక్రమ నిర్మాణం కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు జాప్యం చూపుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అమీర్‌పేట్ సర్కిల్-39 పరిధిలో కొనసాగుతున్న అక్ర మ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సా రించి, ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఒకే చోట నాలుగు భవనాలు

ఎస్‌ఆర్ నగర్ ఓల్డ్ పోలీస్ స్టేష న్ వెనుక లేన్‌లో ఒకేచోట అక్ర మ సెల్లార్‌తో నాలుగు భవనా ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతు న్నారు. అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నా యి. కొందరు అధికారుల స హకారంతోనే నిర్మాణాలు సా గుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Next Story