- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫ్లైట్‌లో బ్యాటింగ్ చేసిన సచిన్.. క్రేజీ వీడియో వైరల్
ఫ్లైట్‌లో బ్యాటింగ్ చేసిన సచిన్ వీడియో వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన చిన్నతనంలోనే భారత జట్టులో స్థానం దక్కించుకున్న సచిన్.. ఎన్నో ఏళ్లు జట్టుకు సేవలందించాడు. వేలాది పరుగులతో పాటు శతకాలు అర్థ సెంచరీలతో నమోదు చేసుకొని చరిత్ర సృష్టించాడు. అయితే అలాంటి సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే సమయం దొరికినప్పుడు తన ఫ్యామిలీతో జాలీగా గడుపుతూ చిల్ అవుతున్నారు.
ఇక లేటెస్ట్ గా ఓ ప్రైవేట్ జైట్ లో తన కుటుంబంతో కలిసి సచిన్ ప్రయాణించారు. ఈ సందర్భంగా కూతురు, కోడలితో సరదాగా క్రికెట్ ఆడారు.. విమానం లోపల సచిన్ బ్యాటింగ్ చేయగా... అర్జున్ భార్య బౌలింగ్ చేశారు. ఈ క్రమంలోనే సారా టెండూల్కర్ క్యాచ్ పట్టి.. తండ్రిని ఔట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన సచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.






