నేడు ఆఫ్ఘానిస్తాన్, భార‌త మ‌ధ్య‌ తొలి వ‌న్డే..తుది జ‌ట్టు ఇవే

by velandi.Saikiran |   (  Updated:2026-06-13 00:29:23  IST  )

నేడు ఆఫ్ఘానిస్తాన్, భార‌త మ‌ధ్య‌ తొలి వ‌న్డే జ‌రుగ‌నుంది.

నేడు ఆఫ్ఘానిస్తాన్, భార‌త మ‌ధ్య‌ తొలి వ‌న్డే..తుది జ‌ట్టు ఇవే
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆఫ్ఘనిస్తాన్, భారత జట్ల మధ్య నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ పూర్తికాగా, భారత్ పై చేయి సాధించింది. ఇక నేటి నుంచి వన్డేలు జరగనున్నాయి. ధర్మశాల వేదికగా మధ్యాహ్నం 1:30 గంటలకు ఆఫ్ఘనిస్తాన్, భారత జట్ల మధ్య తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బరిలో దిగుతున్నాడు.

గాయం కారణంగా విరాట్ కోహ్లీ దూరం కాగా, అతని స్థానంలో జైస్వాల్ మ్యాచ్ ఆడనున్నాడు. ధర్మశాల మైదానం ఛేజింగ్ చేసే జట్టుకు అనుకూలించే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో టాస్ గెలిచిన జట్టు, సెకండ్ బ్యాటింగ్ తీసుకుంటే బెటర్ అంటున్నారు. అటు టెస్ట్ సిరీస్ కోల్పోయిన ఆఫ్ఘనిస్తాన్.. ఎలాగైనా వన్డే సిరీస్ గెలిచి, భారత జట్టుకు షాక్ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఆఫ్గనిస్తాన్. ఈ వ‌న్డే సిరీస్ జియో హాట్ స్టార్‌, స్టార్ స్పోర్ట్స్ వేదిక‌గా ప్రసారం కానుంది.

ఇరు జ‌ట్లు

భారత జట్టు : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ/ప్రిన్స్ యాదవ్.

ఆఫ్ఘనిస్తాన్ జట్టు: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, సెదిఖుల్లా అటల్, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మత్ షా, ఇక్రమ్ అలీఖిల్ (w), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగేయాలియా ఖరోటీ, ఎమ్ ఘజాన్‌సోమీ,

Next Story